స్పీడ్ మీదున్న మాస్ మహారాజ్..మరో సినిమా లైన్ లోకి.. డైరెక్టర్ ఎవరంటే ?

కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఇప్పటికే ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. రాక్షసుడు సినిమా తో హిట్ కొట్టిన మళ్లీ ఫాంలోకి వచ్చిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా రమేష్ వర్మ కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.. అయితే రవితేజ తాజాగా మరో సినిమా ఒప్పుకున్నాడు అనే ప్రచారం మొదలైంది. అయితే ఆయన ఎవరితో సినిమా ఒప్పుకున్నాడు ఆ దర్శకుడు ఎవరు అనే వివరాల్లోకి వెళితే.

కరోనా గ్యాప్ ఉండడంతో

కరోనా గ్యాప్ ఉండడంతో

చాలా కాలం పాటు సక్సెస్ కోసం ఎదురుచూసిన మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు.. నిజానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకు సరైన హిట్టు ఒక్కటి కూడా పడలేదు. ఎన్నో సినిమాలు చేసినా ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఉసూరుమనిపించాయి. విభిన్నమైన కథలు అని భావించి చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా లాంటి సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. కానీ ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన క్రాక్ సినిమా మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

రెండు సినిమాలు లైన్ లో ఉండగానే

రెండు సినిమాలు లైన్ లో ఉండగానే


ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. కిలాడి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే లేదు.. ఈ సినిమా పూర్తయిన తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలు లైన్ లో ఉండగానే ఆయన మళ్లీ కథలు వినడం మొదలు పెట్టాడు. ప్రస్తుతానికి రమేష్ వర్మ కరోనా బారిన పడడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఖాళీగా ఉండటంతో కథలు వింటున్న రవితేజ..

హరీష్ శంకర్ తో సినిమా

హరీష్ శంకర్ తో సినిమా

నిజానికి కొద్ది రోజుల క్రితం ఆయన హరీష్ శంకర్ తో చర్చలు జరిపారని హరీష్ శంకర్ కధతో రవితేజ వద్దకు వెళ్లాడు అనే ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటంతో రవితేజతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు అంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ విషయం మీద సరైన క్లారిటీ లేదు. అయితే పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలు చేసి గానీ హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు రవితేజ పరిస్థితి కూడా అలానే ఉంది. అలాంటప్పుడు హరీష్ శంకర్ కధ తీసుకుని రవితేజ వద్దకు వెళ్లడం గాసిప్ కూడా అయి ఉండొచ్చు.

మారుతీతో సినిమా

మారుతీతో సినిమా

ఇక ఆ ప్రచారం అయిపోగానే రవి తేజ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు అనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న మారుతి తాజాగా రవితేజని కలిసి ఒక కథ చెప్పాడని ఆ కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరిగింది.. రవితేజకు చెప్పిన కథ నచ్చడంతో ఆయన పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని రమ్మనడంతో మారుతి ఆ పనిలో ఉన్నాడు అని అన్నారు. అయితే ఈ విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

Recommended Video

Saranga Dariya 100 Million Views Record, ఆ ఇద్దరూ ప్రధాన కారణం!!
వంశీకృష్ణ డైరెక్షన్ లో

వంశీకృష్ణ డైరెక్షన్ లో


ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం రవితేజ మరో కుర్ర దర్శకుడి కథకూ ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది. దొంగాట సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీకృష్ణ అనే దర్శకుడు తాజాగా రవితేజ ఒక కథ చెప్పాడట. కథ నచ్చడంతో స్క్రిప్టు మొత్తం పూర్తి చేసుకుని రమ్మని రవితేజ చెప్పినట్లు సమాచారం. స్క్రిప్టు మొత్తం పూర్తయ్యాక సినిమా నచ్చితే కనుక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు.. మరి ఈ సినిమా అయినా సెట్స్ మీదకు వెళుతుందో లేక ప్రచారానికే పరిమితం అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X