రవితేజ అభిమానులకు కోలుకోలేని షాక్: పర్మీషన్ విషయంలో చిక్కులు.. ఆ సినిమా రిలీజ్ ఆగిపోయినట్లే!

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు మాస్ మహారాజా రవితేజ. హీరోగా మారిన తర్వాత వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. కొంత కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత సంక్రాంతికి విడుదల అయిన 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు రవితేజ. ఈ చిత్రం భారీ సక్సెస్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్లనూ ఊహించని రీతిలో వసూలు చేసింది. దీంతో ఈ మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సక్సెస్‌తో యమ జోష్‌లో కనిపిస్తున్నాడు.

'క్రాక్' తర్వాత రవితేజ ఒక్కసారిగా స్పీడు పెంచేశాడు. ఇందులో భాగంగానే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌కు బ్రేక్ పడిపోయింది. దీనికితోడు సదరు దేశానికి వెళ్లేందుకు పర్మీషన్ దొరకకపోవడంతో దీన్ని అలా ఆపేసి మరో సినిమాను మొదలు పెట్టాడు రవితేజ.

Ravi Teja Khiladi Movie Release Postponed Again

సుదీర్ఘమైన విరామం తర్వాత కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసుకున్నారు. కానీ, ఇటలీలో చేయాల్సిన షెడ్యూల్‌ను మాత్రం అలాగే ఉంచేశారు. కరోనా నిబంధనల కారణంగా అక్కడ షూట్ చేయడానికి ఆ దేశం నుంచి పర్మీషన్స్ ఇంకా దొరకడం లేదు. దీంతో దీనికోసమే చిత్ర యూనిట్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అది వచ్చిన వెంటనే షూట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు షాకిచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

ప్రస్తుతం కరోనా మరో వేరియంట్ ఒమ్రికాన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో చాలా దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ 'ఖిలాడీ' యూనిట్‌కు ఇటలీ గవర్నమెంట్ నుంచి పర్మీషన్స్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ దీనిపై చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పర్మీషన్ దొరకని పక్షంలో సినిమాను మరోసారి వాయిదా వేయడం ఖాయమని సమాచారం.

'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అలాగే, సాంగ్స్ పరంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X