Waltair Veerayya చిరంజీవి సినిమాలో రవితేజ లిప్ లాక్?.. హీరోయిన్ తో రొమాన్స్!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ సుమారు 22 ఏళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచానలు మాములుగా లేవు. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ చిత్రం పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ లుక్ విడుదలై తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు రవితేజకు సంబంధించిన మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో రవితేజ హీరోయిన్ కు లిప్ లాక్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే విషయంలోకి వెళితే..

రవితేజ ఫైనల్ టచ్..
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన చిరంజీవి త్వరలో వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్న చిరంజీవి వాల్తేరు వీరయ్యకు మాస్ మహారాజ్ రవితేజ ఫైనల్ టచ్ ఇచ్చాడు.

మేకపిల్లను ఎత్తుకుని..
ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. అది సూపర్ ఎనర్జీతో అదరగొట్టింది. మేకపిల్లను ఎత్తుకొని.. గొడ్డలితో సిలిండర్ ను పట్టుకుని తన పేరుకు తగినట్లుగానే రవితేజ మాస్ ఎంట్రీ ఉంది. అంతేకాకుండా ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లను ఎత్తుకొని పులి వస్తుంది అంటూ వచ్చే వాయిస్ ఓవర్ నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లింది. దీంతోపాటు ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ మాస్ యాక్షన్ సీన్స్ చూపించారు.

ఏసీపీ విక్రమ్ సాగర్ గా..
ఇక ఏందిరా వారి.. పిస పిస చేస్తున్నావు.. నీకు ఇంకా సమజ్ కాలే? నేను ఎవని అయ్యకు విననని అంటూ మాస్ మహారాజా రవితేజ తెలంగాణ యాసంలో డైలాగ్ చెప్పడం ఉర్రూతలూగించింది. ఈ చిత్రంలో నిజాయితీపరుడైన, డాషింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఏసీపీ విక్రమ్ సాగర్'గా రవితేజ కనిపించనున్నాడు. అలాగే బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రవితేజ, చిరంజీవి ఇద్దరు అన్నదమ్ములుగా నటిస్తున్నారని ఒక టాక్ వినిపిస్తోంది.

స్పెషల్ సాంగ్ లో చిరు, రవితేజ..
వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవి, రవితేజలపై ప్రత్యేకంగా ఓ సాంగ్ చిత్రీకరించారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి, రవితేజ ఒక స్పెషల్ సాంగ్ లో కలిసి నర్తించడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. గతంలో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఒక పాటలో డ్యాన్స్ వేశారు. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ కు మెగా మాస్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఇక ఈ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బీట్ సిద్ధం చేసినట్లు సమాచారం.

శ్రుతి హాసన్ కాకుండా..
ఈ ప్రత్యేక పాటకు ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారని బజ్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ తో రవితేజ లిప్ లాక్ సీన్లో నటించనున్నాడని ఒక టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో చిరంజీవికి జోడిగా శ్రుతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ మాత్రమే కాకుండా మరో హీరోయిన్ గా కేథరిన్ థ్రేసా అలరించనుందట. రవితేజకు జోడి కట్టిన కేథరిన్ థ్రేసాతో రవితేజ రొమాన్స్ తోపాటు ప్రేక్షకులకు హుషారునిచ్చే లిప్ లాక్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

పవర్ మూవీలో..
కాగా చిరంజీవి, రవితేజ కలిసి అన్నదమ్ములుగా ఇదివరకు నటించిన చిత్రం అన్నయ్య. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రంలో అన్నదమ్ములుగా వీరిద్దరి నటనను అంత త్వరగా మర్చిపోలేం. ఇప్పుడు సుమారు 22 ఏళ్ల తర్వాత చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా నటించడం విశేషం. అలాగే బాబీ దర్శకత్వంలో రవితేజ ఇదివరకు పవర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. అందులో కూడా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











