Ravi Teja Cheap Star ఆ సినిమా ఒప్పుకుని ఉంటే.. రవితేజ ఖాతాలో డిజాస్టర్ పడేదిగా!

ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. శర్వానంద్, సిద్ధార్థ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాలో అను ఇమ్మానియేల్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమా విషయంలో రవితేజ ఆలోచన కరెక్ట్ అని ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా ఒప్పుకోకపోవడం తో ఆయన ఒక భారీ డిజాస్టర్ నుంచి బయట పడ్డారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

సూపర్ హిట్

సూపర్ హిట్

ఆర్ఎక్స్ 100 సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. సినీ పరిశ్రమకు ఏ మాత్రం పరిచయం లేని నూతన నటీనటులను పరిచయం చేస్తూ చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా మంచి సూపర్ హిట్ అయింది.. ఈ సినిమాలో కేవలం రావు రమేష్, లక్ష్మణ్ లాంటి వాళ్ళు తప్ప మిగతా అందరూ కొత్త నటీనటులతో ఈ సినిమా చేశారు.

ఫైనల్ గా

ఫైనల్ గా

చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వస్తాయని భావించారు. అయితే ఆర్ఎక్స్ 100 సినిమా 2018 లో విడుదల కాగా రెండో సినిమా సెట్ కావడానికి చాలా సమయం పట్టింది. ఫైనల్ గా హీరో సిద్ధార్థ, శర్వానంద్ ఇద్దరితో సినిమా రిలీజ్ అయింది కానీ ముందు ఈ సినిమా కథ చాలా మంది హీరోలకు చెప్పాడు భూపతి.

రవితేజ పేరే

రవితేజ పేరే

అయితే ఎక్కువగా వినిపించింది మాత్రం రవితేజ పేరే. సినిమా కథ మొత్తం విన్న రవితేజ సినిమా కధ మొత్తం వచ్చింది కానీ కొన్ని మార్పులు చేర్పులు చేయమంటే దానికి అజయ్ భూపతి ఒప్పుకోలేదు అని అందుకే రవితేజ సినిమా చేయలేను అని చెప్పేశాడు అని అన్నారు. ఆ తర్వాత చీప్ స్టార్ అంటూ అజయ్ చేసిన ట్వీట్ కూడా అప్పట్లో సంచలనం రేపింది.

తేలిపోయింది

తేలిపోయింది

అయితే రెండో సినిమా మహాసముద్రం పేరుతో తెరకెక్కిస్తా అని ప్రకటించినా, ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి పనులు మొదలు కాకుండానే మూడో సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్నట్లు కూడా ప్రకటించారు. ఎలాగైతేనేమి ఎట్టకేలకు అజయ్ భూపతి శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా మహాసముద్రం సినిమా పూర్తి చేశారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలాంటి సినిమా ఇండియన్ హిస్టరీలోనే రాలేదన్నట్లు ప్రచారం చేశారు. కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాక మాత్రం తేలిపోయింది.

Recommended Video

Bigg Boss Telugu 5: VJ Sunny VS Priya చెంప పగిలిపోతుంది.. పిచ్చి పట్టినట్టుంది || Filmibeat Telugu
రవితేజ సేఫ్

రవితేజ సేఫ్

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా చేయకుండా రవితేజ చాలా మంచి పని చేశారు అని రవితేజ అభిమానులు భావిస్తున్నారు. రవితేజ గతంలో లానే డైరెక్టర్ మాటకు కట్టుబడి ఉంటే మరో భారీ డిజాస్టర్ మూటగట్టుకొని ఉండేవాడు అని అంటున్నారు. మొత్తం మీద అజయ్ భూపతి అప్పట్లో చీప్ స్టార్ట్ చేసిన కామెంట్లు కూడా రవితేజ గురించి అన్నట్లు ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు మాత్రం ఎవరి గురించి? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X