For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mega 154 నుంచి రవితేజ రోల్ లీక్.. షాకింగ్ పాత్రలో హీరో?

  |

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో #Mega154 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మాస్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే విషయం బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  మత్స్యకారుని పాత్రలో

  మత్స్యకారుని పాత్రలో


  ఈ సినిమాలో చిరంజీవి మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా రవితేజ నటిస్తుండగా, ఆ పాత్ర ఫ్లాష్‌బ్యాక్ స్టోరీలో ఉంటుందట. ఈ సినిమాలో రవితేజ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. గత కొంతకాలంగా రవితేజ పాత్రపై రూమర్లు విన్పిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ వివరాలు లీక్ అయ్యాయి. లీక్స్ ప్రకారం ఇందులో రవితేజ షాకింగ్ పాత్రలో కనిపించబోతున్నారు.

  పిల్లలున్న వ్యక్తిగా

  పిల్లలున్న వ్యక్తిగా


  తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రవితేజ పెళ్లయ్యి, పిల్లలున్న వ్యక్తి పాత్రను పోషించబోతున్నాడు. ఆయన భార్యగా కేథరిన్ ట్రెసా నటిస్తోంది. రవితేజ కుటుంబం శ్రీలంకలో నివసిస్తున్నట్లు చిత్రంలో చూపించనున్నారు. ఇక ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నందుకు గానూ రవితేజ భారీ రెమ్యునరేషన్ నే మూటగట్టుకుంటున్నాడు అని టాక్. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఆయన అందుకుంటున్న పారితోషికం ఏకంగా 15 కోట్లు. సినిమా కోసం ఆయన 38 నుంచి 40 రోజుల డేట్స్ కేటాయించగా, ఈ నెలాఖరులో చిత్ర షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.

  గట్టిగా ప్లాన్ చేస్తూ

  గట్టిగా ప్లాన్ చేస్తూ


  'ఆచార్య' పరాజయం తర్వాత మేకర్స్ ఈ స్క్రిప్ట్ పటిష్టంగా ఉండేలా చూసుకుంటున్నారు. సినిమాలో భారీ తారాగణం ఉండడమే కాదు, కథ ప్రకారం వారి పాత్రలకు జస్టిఫై అయ్యేలా చూసుకుంటున్నారు. ఇక చిరు సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, మెగా ఎంటర్‌టైనర్ కోసం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల కొంతభాగం పూర్తయ్యింది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవి తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నాడు.

  రవితేజ బిజీ బిజీగా

  రవితేజ బిజీ బిజీగా


  ఇదిలా ఉండగా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే 'ఖిలాడీ' అంటూ ఫ్లాప్ అందుకున్న రవితేజ ప్రస్తుతం "రామారావ్ ఆన్ డ్యూటీ" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ జూలై 29 న విడుదల కానుంది. 'రావణాసుర', 'ధమాకా', 'టైగర్ నాగేశ్వర రావు' వంటి ఆసక్తికర చిత్రాలను రవితేజ లైన్ లో పెట్టారు. మరోవైపు మెగాస్టార్ ఈ సినిమాతో పాటు మలయాళ చిత్రం 'లూసిఫర్‌'కి రీమేక్‌లో కూడా నటిస్తున్నారు.

  మిగతా సినిమాల విషయానికి వెళ్తే

  మిగతా సినిమాల విషయానికి వెళ్తే

  ఈ చిత్రానికి 'గాడ్‌ఫాదర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై రామ్ చరణ్, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. తమన్ సంగీతం సమకురుస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక మెగా లిస్ట్ లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'భోళా శంకర్'.

  English summary
  as per social media buzz Ravi Teja will be seen as a married man with a kid in #Mega154. Catherine Tresa plays his wife. They will stay in Sri Lanka in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X