పవన్ కళ్యాణ్, రవితేజ కాంబినేష్ లో ...
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం షూటింగ్ స్పాట్ కి వెళ్లి రవితేజ ..పవన్ కల్యాణ్ ని కలిసి వచ్చారు. అక్కడ పవన్ తో కాసేపు గడిపి అనేక విషయాలు చర్చించినట్లు చెప్తున్నారు. ఇక ఈ పోటోని నెట్ లో ఉంచటం జరిగింది. దాంతో వీళ్లిద్దరు కాంబినేషన్ లో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారంటూ ఓ రూమర్ మొదలైంది. పూరీ జగన్నాధ్ తాజా చిత్రం దేముడు చేసిన మనుష్యులలో రవితేజ హీరో కాబట్టి ఆయనను కలిసినట్లు ఉంటుంది,పవన్ ని పలకరించి ఉన్నట్లు ఉంటుందని రవితేజ అక్కడికి వచ్చాడని కొందరు అంటున్నారు.
ఇక దేముడు చేసిన మునుష్యులు విషయానికి వస్తే... దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్న వేసుకోవడం, సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో, ఆకలి పోగొట్టిన మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది. ఆ విషయమే మా కథలో చెబుతున్నాం అన్నారు.
ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ చెపుతూ...దేవుడు ఎంతో మంచివాడు. అందుకే చేతులెత్తి దణ్నంపెడుతున్నాం. మరి ఆ దేవుడు చేసిన మన మనుషుల్లో మంచివాళ్లు ఎంతమంది? కర్త, కర్మ, క్రియ... అన్నీ మనమే అయినా ఆ పైవాడిపైనే భారం మోపుతూ ఎలాంటి పనులు చేస్తున్నాం? దేవుడే చేసిన ఓ యువకుడు సమాజానికి ఏం చెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంన్నారు.
రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే, పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్ ఆర్ శేఖర్. కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్సకత్వం...పూరీ జగన్నాధ్.


Click it and Unblock the Notifications











