twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ కిక్ స్టోరీ లైన్!?

    By Staff
    |

    Kick
    రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంధ్రరెడ్డి రూపొందించిన కిక్ స్టోరి అంటూ ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. వారు చెప్పేకునే దాని ప్రకారం ఈ చిత్రం ప్రారంభం ఓ డిఫెరెంట్ స్క్రీన్ ప్లేతో ప్రారంభం అవుతుంది. మొదటి సన్నివేశాల్లోనే..హీరోయిన్ ఇలియానాకి ఓ పోలీస్ ఆఫీసర్(తమిళ హీరో శ్యామ్) తో పెళ్ళి చూపులు జరుగుతూంటాయి. ఆ క్రమలో ఇద్దరూ తమ అభిరుచులూ, అభిప్రాయాలు చెప్పుకుంటూంటారు. అతను తన పెళ్ళి అయ్యేలోగా ఒకడిని పట్టుకోవాలి..అదే తన జీవితాశయం అని చెప్తాడు.

    ఆమె కూడా తను కూడా తన పెళ్ళి అయ్యే లోగా ఒకడికి బుద్ది చెప్పాలి అంటుంది. ఎవరంటే ఎవరు అని ఇద్దరూ ఒకరినొకరు అడుగుతారు. అప్పుడు మొదట పోలీస్ తన ఫ్యాష్ బ్యాక్ చెబుతాడు. అందులో రవితేజ..గురించి..అతన్ని పట్టుకోవాలని తిరగటం, ప్రతీసారి బోల్తా పడటం ఉంటుంది. అతను దొరకడు. ఆ తర్వాత ఇలియానా తన ప్లాష్ బ్యాక్ చెప్తుంది. అందులోనూ రవితేజనే మెయిన్. ఆమె..ప్రేమ కథ అది విడిపోవటం ఉంటాయి. ఇద్దరూ రవితేజకు ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటారు. ఇదంతా పూర్యయ్యేసరికి ఇంటర్వెల్ వస్తుంది. అప్పుడు ఆ ఇద్దరి మధ్యకి రవితేజ వస్తాడు అని తెలుస్తోంది. ఇక రవితేజ పాత్ర ఈ చిత్రంలో హైలెట్ గా నడుస్తుంది అని సమాచారం. చిన్నప్పుడే ఇంట్లోకి గేటు ద్వారా రమ్మంటే..గోడ దూకి వస్తాడని...అందేంటి అంటే ఏ పని చేసినా కిక్ ఇవ్వాలంటాడని తెలుస్తోంది. ఇక అదే హీరోయిన్ దగ్గరా అప్లయ్ చేస్తాడు.

    అనంతరం ఓ సంఘటనతో అతను ఇతరులకు సాయిం చేయటం కూడా కిక్ ఇచ్చేదని తెలుసుకుంటాడని, అక్కడ నుంచి అతని జీవితం మారుతుందని అంటున్నారు. ఇక కిక్ చిత్రంలో తమిళ హీరో శ్యామ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. అతను ఇంతకుముందు '12B" వంటి విభిన్న చిత్రంతో తమిళనాట పరిచయమైన ఈ హీరో అక్కడ మంచి విజయాలే సాధించాడు. అతను ఈ సినిమాలో నటిస్తూండటంతో తమిళ పత్రికల్లో ఈ చిత్రం గురించి వార్తలు,కవరేజ్ వస్తున్నాయి. ఇక కిక్ చిత్రాన్ని అతనొక్కడే ఫేమ్ సురేంధర్ రెడ్డి డైరక్ట్ చేస్తున్నాడు.

    అశోక్, అతిధి చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశి ఈ చిత్రానికి కథ అందింస్తున్నాడు. హైదరాబాద్ ఉర్దూ కాలేజి, స్విర్టర్ లాండ్, మలేషియాలో దాదాపు నలభై ఐదు రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై పరిశ్రమలో మంచి హైప్స్ ఉన్నాయి. పూర్తి ఎంటర్టైన్ మెంట్ తో వచ్చే ఈ చిత్రం రవితేజ హిట్ లో సూపర్ హిట్టే నిలవాలని కోరుకుందాం. ఇంతకీ ఈ స్టోరీ లైన్ కరెక్టో కాదో తెలియాలంటే ఈ శుక్రవారం రిలీజయ్యే కిక్ ని చూడాల్సిందే.బెస్టాఫ్ లక్ కిక్ .

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X