ఒకప్పుడు హిట్స్ ఇచ్చిన దర్శకుడి కోసం రవితేజ సాహసం.. భారీగా ఖర్చు పెట్టేందుకు రెడీ!

మాస్ మహారాజా రవితేజ ఒక సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. గత 15 ఏళ్లుగా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది హీరోలు సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగా, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మరొకలా ఉంటారు. కానీ మాస్ రాజా మాత్రం రిజల్ట్ విషయంలో ఏమాత్రం కంగారు పడకుండా అడుగులు వేస్తూ ఉంటారు విజయం వచ్చినా అపజయం వచ్చినా కూడా రెండింటినీ ఒకే తరహాలో తీసుకుంటూ గుణపాఠం నేర్చుకుంటూ ఉంటాడు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండేందుకు ప్రయత్నిస్తారని ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు.

రవితేజ కెరీర్ మొదట్లో దర్శకుడు అవ్వాలని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అనంతరం తన యాక్టింగ్ స్కిల్స్ తో చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ హీరో వరకు వచ్చాడు. రవితేజకు హీరోగా మొదటి అవకాశం ఇచ్చింది దర్శకుడు శ్రీనువైట్ల సినిమాతోనే. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా నీ కోసం మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత వెంకీ, దుబాయ్ శీను వంటి సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు అందుకున్నాయి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు కాబట్టి శ్రీను వైట్ల వరుస అపజయాలతో ఉండడంతో స్టార్ హీరోలు ఎవరు కూడా అతనితో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపడం లేదు.

Ravi teja new movie with his favorite director srinu vaitla

అలాంటి సమయంలో రవితేజ శ్రీను వైట్లని పిలిచి ఒక సినిమా చేయించాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన నాలుగవ సినిమా అమర్ అక్బర్ ఆంటోని 2018 లో భారీ స్థాయిలో విడుదల అయ్యింది. కానీ బాక్సాఫీసు వద్ద ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ రవితేజ శ్రీను వైట్ల ను ఏ మాత్రం దూరం పెట్టలేదు. కుదిరితే మరో అవకాశం కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. మొత్తానికి రవితేజ క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు. శ్రీను వైట్ల తో కూడా సినిమా చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. అయితే అతనితో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో హీరో రవితేజ సొంత బ్యానర్ స్థాపించి అందులో సినిమా చేసే అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల మంచు విష్ణుతో డి సినిమాకు సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను కూడా హీరో విష్ణు సొంత బ్యానర్ లోనే నిర్వహిస్తుండడం విశేషం. అలాగే చిరంజీవితో కూడా శ్రీనువైట్ల సినిమా చేయాలని అనుకుంటున్నాడు గాని ప్లాన్స్ వర్కౌట్ కావడం లేదు. ఇక రవితేజ, మంచు విష్ణులను నమ్ముకుంటున్న శ్రీనువైట్ల వీలైనంత త్వరగా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. మరి రాబోయే సినిమాలు అతనికి ఎంతవరకు బూస్ట్ ను ఇస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X