మరో బాక్సాఫీస్ దర్శకుడితో రవితేజ న్యూ మూవీ?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ హిట్టు చూసి చాలా కాలమవుతోంది. గత ఐదేళ్లుగా ఈ మాస్ హీరో సక్సెస్ ట్రాక్ చాలా వరకు దారి తప్పిందనే చెప్పాలి. రాజా ది గ్రేట్ తరువాత అయినా కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాలని అనుకున్నాడు గాని ఎంత కొత్తగా ట్రై చేసిన సక్సెస్ దక్కడం లేదు. ముఖ్యంగా డిస్కో రాజాతో భారీ సక్సెస్ అందుకోవాలని గట్టిగానే ట్రై చేశారు. అది కూడా రివర్స్ అయ్యింది.గాని వర్కౌట్ కాలేదు.
ఇక నెక్స్ట్ మాస్ రాజా దృష్టి మొత్తం క్రాక్ సినిమాపైనే ఉంది. అయితే ఆ సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేస్తుందా లేక ఓటీటీలో రిలీజ్ అవుతుందా అనేది బిగ్ సస్పెన్స్ గా మారింది. ఆ విషయాన్ని పక్కనపెట్టి అసలు మ్యాటర్ లోకి వస్తే.. రబితేజ ఫైనల్ గా ఒక బాక్సాఫీస్ దర్శకుడిని పట్టినట్లు తెలుస్తోంది. కామెడీ కథలతో తనదైన శైలిలో హిట్స్ అందుకునే మారుతి రవితేజ కోసం కూడా ఒక కథను రాసుకున్నట్లు టాక్ వస్తోంది.

ఈ దర్శకుడు అల్లు అర్జున్, గోపిచంద్, నాని వంటి హీరోలతో వర్క్ చేయనున్నట్లు మొన్నటివరకు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా యువ హీరో రామ్ తో కూడా ఒక కథపై చర్చలు జరిపినట్లు టాక్ వచ్చింది. ఇక వాళ్ళంతా బిజీగా ఉండడంతో మారుతి కన్ను రబితేజపై పడినట్లు తెలుస్తోంది. ఆల్ మోస్ట్ కథ ఫినిష్ చేసిన మారుతి రబితేజ ఫైనల్ కాల్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కరోనా తీవ్రత తగ్గితే వచ్చే నెల ప్రాజెక్టును ఎనౌన్స్ చేసి ఆ తరువాత నెలలో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











