ఆ దర్శకుడితో రవితేజ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
మాస్ మహారాజా రవితేజకు దురదృష్టం.. అదృష్టం పట్టినట్టుగా ఉంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరున్న విఐ ఆనంద్ కూడా రవితేజకు ఓ హిట్ ఇవ్వలేకపోయాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన డిస్కోరాజా సైతం బెడిసికొట్టింది. అయినా సరే మాస్ మహారాజా మాత్రం తగ్గడం లేదు.
ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఏ రేంజ్‌లో రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ ఫుల్ ఖుషీ అయింది. తాజాగా రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చేసింది.

మేము వయసుకు వచ్చాము, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ మీదున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో రవితేజ తన తదుపరి చిత్రాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వీర లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన రమేష్ వర్మతో కూడా రవితేజ ఓ సినిమాను చేసేందుకు సిద్దమయ్యాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఈ రెండింటిలో ఏది ముందు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











