రవితేజ ‘నిప్పు’ షారుఖ్ సినిమాకు రీమేకా?

By Bojja Kumar

మాస్ మహారాజ్ రవితేజ సంక్రాంతికి 'నిప్పు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. మిరపకాయ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన దీక్షా సేథ్ ఇందులో లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా టర్కీలో షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ, దీక్షాసేథ్ లపై ఇక్కడ పాటల చిత్రీకరణ జరుగుతోంది.

తాజాగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం...నిప్పు ఆ మధ్య బాలీవుడ్ లో వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమా 'చక్ దే'సినిమాకు రీమేక్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. చక్ దే సినిమాలో షారుఖ్ మాదిరి రవితేజ కూడా ఈ సినిమాలో స్టోర్ట్స్ కోచ్ గా కనిపించబోతున్నారని అంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...గతంలో వచ్చిన రవితేజ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని, రవితేజ మార్కు సినిమాలా కాకుండా డిఫెరెంట్ గా ఉంటుందని చర్చించుకుంటున్నారు.

మరో పుకారు ఏమిటంటే...ముందుగా అనుకున్నట్లుగా నిప్పు సంక్రాంతికి విడుదల కావడం లేదని...జనవరి 25కు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో..? నిప్పు సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యలు అధికారికంగా వెల్లడిస్తేగానీ అసలు విషయం అభిమానులకు చేరే అవకాశం కనిపిండం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X