రవితేజ 'నిప్పు' కథేంటి?
రవితేజ, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం నిప్పు శుక్రవారం అంతటా రిలీజ్ అవుతోంది. దీక్షాసేధ్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో హీరో రవితేజ సూర్య పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం కథ లీకైందంటూ ఓ స్టోరీ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. దాని ప్రకారం... సూర్య (రవితేజ)లక్ష్యమంటూ లేకపోవడమే జీవితంలో అతి పెద్ద లక్ష్యం అని నమ్మి తిరుగుతూంటాడు. అతనికి ఓ స్నేహితుడు శ్రీరాం (శ్రీరాం). శ్రీరాం దుబాయి లో ఉద్యోగం చేసుకుంటూంటాడు. అనుకోకుండా రాజాగౌడ్ (ప్రదీప్‌రావత్) తమ్ముడుని చంపేస్తాడు. దాంతో అతనికి అక్కడ ఉరిశిక్ష పడుతుంది.
అయితే అక్కడ సంప్రదాయం ప్రకారం ఎవరైతే కేసు పెట్టారో వాళ్ల వాళ్ళు క్షమిస్తే ఉరి రద్దవుతుంది. ఈ నేపధ్యంలో ఈ ఉరి విషయం తెలుసుకున్న సూర్య అక్కడికి బయిలు దేరి వెల్తాడు. అక్కడ పెద్ద గ్యాంగస్టర్ అవుదామనుకున్న రాజాగౌడ్ (ప్రదీప్ రావత్)ని పట్టుకుని మెప్పించి తన స్నేహితుడుని సేవ్ చేసుకున్నాడనేది మిగతా కథ. అయితే ఇది కరెక్టు కధా.. కాదా అన్నది తేలాలంటే రేపు సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కూడా ముగ్గురు కూతుళ్లకి తండ్రి నారాయణ మూర్తిగా ఓ కీలకపాత్రను చేసాడు. అలాగే హీరోయిన్ దీక్షాసేధ్ .. ఓ అథ్లెట్ గా మేఘన పాత్రలో కనిపిస్తుంది. వైవియస్ చౌదరి తన బొమ్మరిల్లు బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











