భారీ సినిమా కోసం.. రెమ్యూనరేషన్ వద్దంటూనే నిర్మాతకు షాకిచ్చిన రవితేజ

మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌‌ఆర్‌‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవకుండానే రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని కొద్దిరోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అదే.. 'RX100' దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించబోయే భారీ మల్టీ స్టారర్ మూవీ.

'RX100' దర్శకుడు అజయ్ భూపతి త్వరలోనే మాస్ మహరాజ రవితేజతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఎప్పటి నుంచో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమాను మల్టీ స్టారర్‌గా తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఇందులో రవితేజతో పాటు సిద్ధార్ద్‌ను కూడా నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు జరుపుతున్నాడని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకుముందు ప్రచారంలో ఉన్న 'మహాసముద్రం' అనే స్క్రిప్టుతోనే ఈ సినిమా ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు.

 Ravi Teja no remuneration For Ajay Bhupathi Movie

దీనికి సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు రవితేజ రెమ్యూనరేషన్ లేకుండానే పని చేస్తున్నాడట. అయితే, సినిమా లాభాల్లో మాత్రం వాటా తీసుకుంటాడని సమాచారం. ఈ మేరకు ఆయన ఇప్పటికే నిర్మాతతో డీల్ కుదుర్చుకున్నాడని తెలిసింది. వాస్తవానికి ఈ సినిమా కథ ఆయనకు బాగా నచ్చేసిందట. కానీ, ఈ మాస్ హీరో అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాత ముందుకు రాలేదనే టాక్ వినిపిస్తోంది. మంచి సినిమాను వదులుకోకూడదనే ఉద్దేశ్యంతో రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'డిస్కోరాజా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. వాస్తవానికి 'RX100' వచ్చి ఏడాది పూర్తయినా ఈ చిత్ర దర్శకుడు మరో సినిమాను పట్టాలెక్కించలేదు. దీనికి కారణం 'మహాసముద్రం' స్క్రిప్టుపై కసరత్తు చేయడమేనని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. మల్టీ స్టారర్ సినిమా కావడంతో దీనికి మంచి లాభాలే వస్తాయని రవితేజ భావిస్తున్నట్లు వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X