రవితేజ ఆఫ్ స్క్రీన్ పాలిటిక్స్ కి ఝలక్ ఇచ్చిన యంగ్ హీరో..?!
ఈ మధ్య హీరోగా దూసురుపోతున్న సునీల్ పై రవితేజ కుట్ర పన్నాడా?అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు వీరి మధ్యన జరిగిన ఓ సిట్యూయేషన్. 'మర్యాదరామన్న" మూవీ హిట్ తర్వాత సునీల్ చేసిన 'కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: అప్పల్రాజు" మూవీని ముందుగా రవితేజతో చేయాలని అనుకున్నాడట వర్మ. కానీ స్టోరీ మొత్తం తెలుసుకున్న రవితేజ, ఈ కథలో డైరెక్టర్ గా సునీల్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని అతని దగ్గరికి ఈ కథని పంపించడమే కాకుండా దగ్గరుండి మరీ సునీల్ కి మంచి అవకాశాలు రావడంతో కుళ్లుకుంటున్నాడట రవితేజ.
ప్రస్తుతం సునీల్ ఐదారు చిత్రాలు ఓకే చేసేసి రవితేజ కంటే ఎక్కువగా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం 'లేడీస్ టైలర్" మూవీ దర్శకుడు వంశీ, రవితేజతో చేయాలనుకుంటున్న 'ఫ్యాషన్ డిజైనర్"ని వంశీ ఇప్పుడు సునీల్ తో ఆ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే రవితేజ కాదు సునీలే అతనికి ఝలక్ ఇచ్చినట్లు అవుతుందని సినీ ప్రియులలో కొందరి అభిప్రాయం.


Click it and Unblock the Notifications











