రవితేజకు 3.50 కోట్ల పెనాల్టి!?
సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్టార్ హీరో రవితేజ. ఎంటర్టైన్మెంట్ తో తన దైన శైలి నటనతో దూసుకుపోతున్న రవితేజ కు ఐటీ డిపార్టమెంట్ ..మూడున్నర కోట్లు పెనాల్టీ విధించిందని రూమర్ కొద్ది రోజులుగా పిల్మ్ సర్కిల్స్ లో ప్రయాణం చేస్తోంది. అయితే దీనికి ఆధారాలు ఏమీ లేవు కానీ..రవితేజ తన వద్ద నున్న ఇరవై కోట్ల రూపాయలకు లెక్కలు చూపించకపోవటంతో ఈ పెనాల్టి విధించారని చెప్పుకుంటున్నారు.
అయితే ఇది నిజమా,ఉత్తిగా అనేది ఎక్కడా క్లారిటీ లేదు. అయితే రవితేజ మొదటనుంచి లెక్కలు కరెర్టుగా చూపిస్తాడని,చాలా నిజాయితీపరుడని ఇండస్ట్రీలో పేరుంది. కాబట్టి ఇది రూమర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం రవితేజ..నిప్పు చిత్రం బిజీలో ఉన్నారు. గుణశేఖర్ దర్సకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రాన్ని వైవియస్ చౌదరి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ గత సంక్రాంతికి మిరపకాయ చిత్రం విడుదలై మంచి క్రేజ్ సంపాదించుకోవటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











