twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాంకాక్ లో రవితేజ ..ప్రెండ్స్ తో కలిసి ఎంజాయ్

    By Srikanya
    |

    హైదరాబాద్: మాస్ మహారాజ గా పేరు తెచ్చుకున్న రవితేజ ని వరస ప్లాప్ ల నుంచి బలుపు బయిటపడేసింది. త్వరలో ఆయన కొత్త చిత్రం వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ గ్యాప్ లో ఆయన రిలాక్సేషన్ నిమిత్తం బ్యాంకాక్ క్యాప్ వేసారు. తన దర్శక,మిత్రుడు పూరీ జగన్నాథ్ కి ఇష్టమైన బ్యాంకాక్ అంటే రవితేజకు కూడా మొదటి నుంచీ ఇంట్రస్టే. అందుకే ఆయన ఖాళీ ఉన్నప్పుడు అక్కడ వాలి పోతారు. ఇప్పుడదే చేస్తున్నారు. ఆయన ప్రెండ్స్ ని తీసుకుని అక్కడ ఎంజాయ్ చేయటానికి వెళ్లారని ఫిల్మ్ నగర్ సమాచాచరం.

    ఇక ఆయన కొత్త చిత్రాన్ని కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బలుపు చిత్రానికి కథ అందించిన బాబి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారు. రవితేజ..బలుపు చిత్రం తోటే ప్లాప్స్ నుంచి బయిట పడ్డారు. ఇప్పుడీ చిత్రం కూడా పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుందని సమాచారం.

    బలుపు హిట్ తో ఊపు మీద ఉన్న రవితేజ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. బలపు రచయిత...బాబి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వైవియస్ చౌదరి ఈ చిత్రం నిర్మిస్తారనుకున్నారు. అయితే తాను అంత బడ్జెట్ పెట్టలేనని చేతులు ఎత్తేయటంతో రాక్ లైన్ వెంకటేష్ తో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తోంది. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ ఫిల్మ్ గా చిత్రం రూపొందనుందని సమాచారకం. ఈ నెలాఖరనుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది. బాబి గతంలో ... డాన్ శ్రీను, బాడీ గార్డ్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకు రచనా సహకారం అందించారు.

    వరుస ప్లాపులతో సతమతం అయిన రవితేజకు 'బలుపు' చిత్రం హిట్‌తో కాస్త ఊరట లభించింది. ఇంత కాలం స్క్రిప్టుపై పెద్దగా దృష్టి పెట్టని రవితేజ... బలుపు చిత్రం దగ్గర నుంచి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. గుడ్డిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటే పోతే తన కెరీర్‌కు ఆపద తప్పదని గ్రహించాడు. అందుకే కథ, స్క్రిప్టు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.

    ఈ చిత్రం తో పాటు రవితేజ తర్వాతి సినిమా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కథ, స్క్రిప్టు విషయంలో ఓ అవగాహన కుదిరిందని తెలుస్తోంది. రీమేక్ మూవీల దర్శకుడిగా పేరుతన్న భీమినేని శ్రీనివాసరావు గతంలో అల్లరి నరేష్ హీరోగా 'సుడిగాడు' చిత్రం తెరకెక్కించారు. ఓ తమిళ చిత్రం రీమేక్‌గా తెరకెక్కించిన 'సుడిగాడు' చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, తెలుగు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను రాబట్టింది. తాజాగా రవితేజ-భీమినేని కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా తమిళ రీమేక్ సినిమానే అని, తమిళంలో హిట్టయిన 'సుందర పాండ్యన్' చిత్రాన్ని తెలుగులో వీరిద్దరి కాంబినేషన్లో రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టు విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

    English summary
    Ravi Teja hasn’t been seen much after his last hit 'Balupu'. It is now being said that the actor has signed another film with 'Balupu' maker Bobby, which is set to go on the floors next month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X