RAVANASURA మూవీలో రవితేజ పాత్ర లీక్.. ఇంటర్వెల్ అలా ప్లాన్ చేసిన డైరెక్టర్

టాలీవుడ్‌లో రాకెట్ వేగంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం మరింతగా దూసుకుపోతోన్నాడు. ఇలా ఏడాదికి కనీసం మూడు సినిమాలనైనా అందిస్తూ ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక, గత ఏడాది చివర్లో 'ధమాకా'తో బిగ్ హిట్ కొట్టిన రవితేజ.. ఆ వెంటనే సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో మరో బ్లాక్‌ బస్టర్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఈ మాస్ హీరో 'రావణాసుర'గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

హిట్ల పరంపరతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు 'రావణాసుర' అనే చిత్రంలో నటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దీన్ని తెరకెక్కించడంతో పాటు ఇది క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతుందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని భారీ స్టార్ కాస్ట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ప్రస్తుతం అన్ని హంగులూ పూర్తి చేసుకున్న 'రావణాసుర' చిత్రం మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చేశాయి.

Ravi Teja Role Details Leaked From RAVANASURA Movie

ఏప్రిల్ 7వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతున్న 'రావణాసుర' మూవీలో మాస్ మహారాజా రవితేజ పాత్ర గురించి కీలక విషయాలు లీక్ అయ్యాయి. ఆ సమాచారం ప్రకారం.. రవితేజ ఫస్టాఫ్ మొత్తం కామెడీని పండించే ఓ లాయర్ పాత్రలో కనిపిస్తాడట. ఇంటర్వెల్ సమయంలో మాత్రం అతడే రావణాసుర అనే ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. సెకెండాఫ్‌లో రవితేజ పాత్ర నెగెటివ్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది అనే అంశాలను ఫ్లాష్‌బ్యాక్ రూపంలో చూపిస్తారని తెలిసింది. మొత్తంగా ఇందులో ఇంటర్వెల్‌లో వచ్చే ఎపిసోడ్ ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేశారని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. 'రావణాసుర' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. సుశాంత్ నెగెటివ్ రోల్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X