హీరో రవితేజ దిమ్మదిరిగే డీల్: 16 కోట్లకు మైత్రి మూవీస్ ఓకే చెప్పిందా?
Recommended Video

మైత్రి మూవీ మేకర్స్... ఈ పేరు టాలీవుడ్లో ఇపుడు మార్మోగి పోతోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం.... ఇలా ఒకదాన్ని మించి మరొకటి హిట్ కొడుతూ హాట్రిక్ కొట్టిన ఈ సంస్థ నెక్ట్స్ రవితేజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీస్ వారు మాస్ మహారాజతో కుదుర్చుకున్న డీల్‌కు సంబంధించిన వివరాలు బయటకు లీక్ అయ్యాయి. రెండు సినిమాలకు కలిపి రూ. 16 కోట్లకు అగ్రిమెంట్ జరిగిందని ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ నడుస్తోంది.

రవితేజతో రెండు సినిమాలు ఇవే..
ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్' చేస్తున్న రవితేజ..... దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టుకు కమిట్మెంట్ ఇచ్చారు. శ్రీను వైట్లు, సంతోష్ శ్రీనివాస్‌తో రవితేజ చేస్తున్న రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

రూ. 20 కోట్లు అడిగిన రవితేజ
రెండు సినిమాలకు కలిపి రవితేజ రూ. 20 కోట్లు అడిగినట్లు సమాచారం. అయితే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలైన నవీన్ యర్నేని, వై రవి శంకర్, సివి మోహన్ కలిసి చర్చలు జరిపి రూ. 16 కోట్లకు డీల్ సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.

మళ్లీ విజృంభించనున్న రవితేజ
ఈ మధ్య సరైన హిట్స్‌లేని రవితేజ ‘రాజా ది గ్రేట్' సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘టచ్ చేసి చూడు' మూవీ నిరాశ పరిచింది. అయితే ఈ సారి అభిమానులను మెప్పించే ఫుల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ‘నేల టిక్కెట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ద్వారా రవితేజ బాక్సాఫీసుపై విజృంభిచండం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అమర్ అక్బర్ ఆంటోనీ
శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్లో గతంలో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంతోష్ శ్రీనివాస్ మూవీలో పోలీస్‌గా రవితేజ
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ చేయబోయే సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. కాజల్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్‌గా క్యాథరిన్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











