ఇంకో పెద్ద సినిమాకీ బ్రహ్మానందమే దిక్కుట

By Srikanya

హైదరాబాద్: బ్రహ్మానందం కీ టైమ్ లో సెకండాఫ్ లో వస్తే సినిమా హిట్టే అనేది రీసెంట్ గా వచ్చిన రేసు గుర్రం సైతం ప్రూవ్ చేసేసింది. దాంతో బ్రహ్మానందంపై నమ్మకాలు మరింత పెరిగిపోతున్నాయి. రాబోయే సినిమాలన్నిటిలోనూ బ్రహ్మానందాన్ని నమ్ముకునే సీన్స్ సిద్దం చేస్తున్నారు. తెలిసిన సమాచారం ప్రకారం రవితేజ తాజా చిత్రం 'పవర్‌' లోనూ బ్రహ్మానందం పవర్ చూపిస్తున్నాడంటున్నారు. ఆయన పాత్ర కీలకంగా సినిమాలో ఉంటుందని, అదే సినిమాకు ప్లస్ గా నిలుస్తుందని, అందుకే ట్రైలర్స్ తో సైతం బ్రహ్మానందంపై డైలాగుతో విడుదల చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

గతంలోనూ రవితేజ,బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు, కిక్,బలుపు చిత్రాలు ఘన విజయం సాధించాయి. దాంతో ఈ సారి కూడా బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టే హిట్ కొట్టాలని ఆ యూనిట్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి కామెడీగా తయారవుతోందని చెప్తున్నారు. మరో ప్రక్క పంచ్ డైలాగులు సైతం ఈ సినిమాలో అదిరిపోతాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

Ravi Teja's – Brahmanandam comedy to be a highlight

'బలుపు'లో మాస్‌గానూ, క్లాస్‌గానూ కనిపించి రవితేజ పంచ్‌లేసి నవ్వించారు. బ్రహ్మానందం భుజాన ఎత్తుకుని క్లైమాక్స్ ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అదే తరహాలో నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో 'పవర్‌' అనే సినిమా చేస్తున్నారు రవితేజ. హన్సిక, రెజీనా హీరోయిన్స్. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

నిర్మాత మాట్లాడుతూ... ''రవితేజ గత సినిమాల్లోలాగే యాక్షన్‌, వినోదం మేళవించిన కథ ఇది. ఇటీవల కోల్‌కతా, చెన్నైలలో చిత్రీకరణ జరిపాం. ఇప్పుడు చిత్రప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నాం. రవితేజ తనదైన శైలిలో పంచ్‌ డైలాగ్‌లతో అలరించబోతున్నారు'' అన్నారు.

రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X