Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
రవితేజకు ...అలా మొదలైంది
హైదరాబాద్: త్వరలో రవితేజ... 'అలా మొదలైంది' నిర్మాత దామోదర ప్రసాద్ నిర్మాణంలో ఓ చిత్రం ప్రారంభించనున్నారు. తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశాడు.
కిక్ 2 సినిమాలో రవితేజ క్యారెక్టర్ పేరు రాబిన్ హుడ్. ఇప్పుడు ఇదే పేరును తన నెక్ట్స్ సినిమాకు టైటిల్ గా ఫైనల్ చేశాడు రవితేజ. చక్రి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఈ టైటిల్ ..సినిమాకు కిక్ ఇచ్చిందని అభిమానులు అంటున్నారు.
బెంగాల్ టైగర్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన రవితేజ వేణు శ్రీరామ్ తో అనుకున్న 'ఎవడో ఒకడు' సినిమా ఆగిపోయింది. దిల్ రాజు తో కథా విషయంలో సెట్ కాకే ప్రాజెక్టు ప్రారంభమై ఫస్ట్ షెడ్యూల్ లోనే ఫుల్ స్టాప్ పెట్టేసారు. దాంతో వెంటనే మరో ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించాలని రవితేజ ఇలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు మరో సినిమాలోనూ నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినరని వినపడుతోంది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్‌తో కలసి వర్క్ చేసేందుకు రవితేజ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో చిత్రం రాబోతోంది. ఆ రెండు చిత్రాలతో రవితేజ నటన కచ్చితంగా అభిమానుల్ని ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.