»   » 'సారొచ్చారు' కి దాసరి సెటిల్ మెంట్?

'సారొచ్చారు' కి దాసరి సెటిల్ మెంట్?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సారొచ్చారు'. ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఈ చిత్రం పై రకరకాల వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా చిత్రం విడుదల విషయంలో రవితేజకు నిర్మాత అశ్వనీదత్ కి మధ్య సయోధ్యని ప్రముఖ దర్శక,నిర్మాత దాసరినారాయణరావు కుదిర్చారని .

  ఈ చిత్రం రెమ్యునేషన్ విషయంలో అశ్వనీదత్ ట్విస్ట్ ఇవ్వటంతో రవితేజ అలిగాడని,అందుకే ఆడియో పంక్షన్ ని సైతం చెయ్యలేదని తెలుస్తోంది. చిత్రం కోసం రవితేజకు ఏడు కోట్ల రెమ్యునేషన్ ఎగ్రిమెంట్ అని..అయితే అందులో ఐదు ఇచ్చినా తర్వాత రెండు కోట్లు పెండింగ్ లో పెట్టడంతో సమస్య మొదలైందని చెప్తున్నారు. అయితే రవితేజ ఆ పేమెంట్ పూర్తి చేసాకే..డబ్బింగ్ చెప్తాననటంతో ... దాసరి జోక్యం చేసుకుని సెటిల్ చేసాడని తెలుస్తోంది.

  ముందుగా అశ్వనీదత్..కోటి రూపాయలు..ని రవితేజకు ఇప్పించారని ...అయితే మిగిలిన కోటి రూపాయలకు ఈస్ట్ గోదావరి రైట్స్ ని సిరి మీడియా తరుపున ..రవితేజకు ఇచ్చారని, దాసరికి చెందిన సిరి మీడియా దానిని ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూట్ చేస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే ..దాసరి నైజాం రైట్స్ ని తీసుకున్నారు.

  'మంచి ప్రేమ కథతో' అనేది సబ్ టైటిల్. డిసెంబర్ 21న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఊటీ, యూరఫ్, హైదరాబాద్ లలో నిర్వహించారు. దర్శకుడు పరశురామ్ ఈచిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి.

  ఈచిత్రాన్ని త్రీ ఏంజిల్స్ స్టూడియో బేనర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాక దత్ నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన రవితేజ వరుస మూస సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోంది. సినిమాలో వినోదానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. అదే విధంగా నిర్మాణ విలువలు కూడా భారీగా ఉండనున్నాయి. మరి ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

  English summary
  Film nagar is full of rumours about Raviteja's 'Saarocharu'. Film makers got in touch with Dasari Narayana Rao for whom they have given Nizam rights and now the buzz is, it is between Dasari and Raviteja who will be sorting out the Rs 1cr deal by the request of the Producer Aswini Dutt and the producers have assigned the release rights of the picture for East Godavari District also to Dasari’s Siri Media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more