పవన్ వద్దన్నాడు కాబట్టే రవితేజ: బెంగాల్ టైగర్?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం తెరరెక్కాల్సి ఉంది. అయితే స్క్రిప్టు నచ్చక పోవడంతో పవన్ కళ్యాణ్ మార్పులు కోరాడు. ఎన్ని సార్లు మార్పులు చేసినా పవన్ కళ్యాణ్‌ను మాత్రం మెప్పించలేక పోయాడు. రెండేళ్ల సమయం వృధా అయినా....పవన్ కళ్యాణ్ మాత్రం ఏ విషయం తేల్చక పోవడంతో మేల్కొన్న సంపత్ నంది తన దారి తను చూసుకున్నాడు.
పవన్ కళ్యాణ్ రిజక్టు చేసిన కథను రవితేజకు వినిపించి ఓకే చేయించుకున్నాడు ఫిల్మ్ నగర్ టాక్. ఆ కథను పవన్ కళ్యాణ్ రిజక్టు చేసాడని తెలిసి కూడా రవితేజ సంతోషంగా ఓకే చెప్పాడట. అందుకు కారణం ఓ సెంటిమెంటు అని అంటున్నారు. గతంలో రవితేజ నటించిన ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలు మంచి విజయం సాధించాయి. కెరీర్ తొలి నాళ్లలో ఆ విజయాలు రవితేజను పెద్ద స్టార్‍ను చేసాయి. వాస్తవానికి ఈ రెండు సినిమా కథలు తొలుత పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి తిరస్కరణకు గురయ్యాయి.

అలా పవన్ కళ్యాణ్ వద్దన్న కథల్లో నటించని రవితేజ విజయాలు సొంతం చేసుకున్నాడు. ఇపుడు సంతప్ నందికి ఓకే చెప్పడం వెనక కూడా ఆ సెంటిమెంటే కారణమని అంటున్నారు. సాధారణంగా రవితేజ కథ ఓకే చేసాడంటే...అది ఆయన ఎనర్జీకి తగిన విధంగా ఉంటుందని అర్థం. ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందనే భావిస్తున్నారు.
కాగా...సంతప్ నంది ఈచిత్రానికి బెంగాల్ టైగర్ అని పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ పేరు కూడ సిద్ధార్థరాయ్ అని ఉంటుందట. ఇది గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి' చిత్రంలోని క్యారెక్టర్ పేరు. ఈ పేరు పెట్టడం కూడా సెంటిమెంటుగా కలిసొస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











