పవర్ కట్ చేయటానికే మహేష్ దిగుతున్నాడు
హైదరాబాద్ : మహేష్ ఛరిష్మా భాక్సాఫీస్ వద్ద మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే. అతని సినిమాకు ఓపినింగ్స్ అదిరిపోతాయి. టాక్ ని బట్టి కలెక్షన్స్ రేంజి పెరిగిపోతూ ఉంటుంది. అందుకే మహేష్ చిత్రం విడుదల అవుతోందంటే దాని దగ్గరలో మరో చిత్రం విడుదల పెట్టుకోరు. కానీ ఇప్పుడు మహేష్ బాబు చిత్రం ఆగడు కు రవితేజ చిత్రం పవర్ కట్ అయ్యేటట్లు కనపడుతోంది. ఎందుకంటే పవర్ చిత్రం సెప్టెంబర్ 12 న విడుదల చేస్తున్నారు.
సరిగ్గా వారం తర్వాత అంటే సెప్టెంబర్ 19న ఆగడుని విడుదల చేయటానికి డేట్ ఖరారు చేసేసారు. అంటే పవర్ ఎంత పెద్ద హిట్టైనా...వారం తర్వాత ఖచ్చితంగా మహేష్ కు థియోటర్స్ ఇవ్వాల్సి వస్తుందనేది నిజం. దాంతో ఇప్పుడు పవర్ కొనుక్కున్నవాళ్లు టెన్షన్ లో పడుతున్నారు. రభస కోసం వాయిదా వేసుకుంటే ఆగడుకి దొరికిపోతామని అంటున్నారు. అయితే దీనికి సినిమా పెద్దలు ఏం పరిష్కారం ఆలోచిస్తారో చూడాలి.

పవర్ విషయానికి వస్తే..
అతనో డాషింగ్ పోలీసాఫీసర్. దుష్టశిక్షణలో తనదైన మార్క్‌ను కనబరుస్తుంటాడు. ఏ అధికారానికి తలొగ్గక నిజాయితీగా పనిచేయడమే అతనికున్న పవర్. అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ దుర్మార్గుల ఆట కట్టించడానికి సరికొత్త పథకాన్ని రచిస్తాడు. అదేమిటో తెలుసుకోవాలంటే మా పవర్ చిత్రం చూడాల్సిందే అంటున్నారు కె.ఎస్.రవీంద్ర (బాబి). ఆయన దర్శకత్వంలో రవితేజ హీరో గా నటిస్తున్న చిత్రం పవర్. అన్ లిమిటెడ్ అనేది ఉపశీర్షిక.
హన్సిక, రెజీనా కథానాయికలు. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇందులో రవితేజ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుంది. ఆయన శైలి వినోదం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా వుంటాయి. వినోదంతో పాటు మాస్ అంశాలు మేళవించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. రవితేజ కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన చిత్రమవుతుంది అన్నారు.
బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్‌రుషి, రావు రమేష్, సంపత్‌రాజ్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయనన్ విన్సెంట్, మనోజ్‌పరమహంస, మాటలు: కోన వెంకట్, స్క్రీన్‌ప్లే: చక్రవర్తి, మోహనకృష్ణ, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.బి.కృష్ణ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి).


Click it and Unblock the Notifications











