బాలయ్య, పవన్ కళ్యాణ్‌ను టచ్ చేస్తూ బరిలో రవితేజ?
Recommended Video

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు సినిమా బాక్సాఫీసు వద్ద సందడే సందడి. టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ కురిపించే సీజన్ ఇది. ఈ సీజన్లో తమ సినిమా విడుదల చేయాలని ప్రతి స్టార్ కోరుకుంటాడు. ఎప్పటిలాగే రాబోయే సంక్రాంతి సీజన్లో కూడా పలువురు టాప్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, తమిళ హీరో సూర్య మాత్రమే ఉన్నారు. తాజాగా రవితేజ కూడా సంక్రాంతి బరిలో దూకేందుకు సిద్దంగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

సంక్రాంతి బరిలో రవితేజ టచ్ చేసి చూడు
రవితేజ హీరోగా రూపొందుతున్న ‘టచ్ చేసి చూడు' చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకుడు.

మొదలు కానున్న ప్రమోషన్స్
‘టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్ పోస్టర్స్ చాలా రోజుల క్రితమే విడుదలయ్యాయి. ఇంతకాలం చడీ చప్పుడు లేకుండా ఉన్న ఈ చిత్రం తాజాగా హాట్ టాపిక్ అయింది. మరో నెల రోజుల సమయం ఉండటంతో టీజర్, ట్రైలర్, ఆడియో ఫంక్షన్ లాంటివి నిర్వహించి ప్రచారం హోరెత్తించనున్నట్లు తెలుస్తోంది.

జనవరి 10న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి
మరో వైపు పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి' చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఎస్. రాధాకృష్ణ నిర్మాత.

బరిలో బాలయ్య
బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న "జై సింహా" చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

గ్యాంగ్ తో వస్తున్న సూర్య
జ్ఞానవేళ్ రాజా నిర్మాతగా సూర్య కథానాయకుడిగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందించిన "తాన సెరంధ కూటమ్" అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మక యు. వి. క్రియేషన్స్ బ్యానర్లో "గ్యాంగ్" పేరుతో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్. రమ్యకృష్ణ, కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. జనవరి 12, 2018న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశి ప్రకటించారు.


Click it and Unblock the Notifications











