twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయిధరమ్ తేజ్, రవి తేజని హర్ట్ చేసిన హరీష్ శంకర్.. ఒక్క మాట కూడా చెప్పకుండా!

    |

    గబ్బర్ సింగ్, మిరపకాయ్, డీజే లాంటి చిత్రాలతో కమర్షియల్ దర్శకుడిగా హరీష్ శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హరీష్ శంకర్ సినిమాలు ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచుతాయి. డీజే తరువాత హరీష్ మరో చిత్రాన్ని ప్రకటించలేదు. ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించాలని భావించినా ఎందుకనో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండని రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరో యువ హీరో ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంగ్ల పత్రికలో హరీష్ శంకర్ గురించి వచ్చిన కథనం వైరల్ గా మారుతోంది. హరీష్ శంకర్ వలన ఇద్దరు హీరోలు బాగా హర్ట్ అయినట్లు ఆ కథనం సారాంశం.

    రవితేజ మాట ఇచ్చిన కూడా

    రవితేజ మాట ఇచ్చిన కూడా

    జిగర్తాండ చిత్రం సిద్ధార్థ్, బాబీ సింహా లాంటి నటులకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ చిత్రంలో పాత్రలు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా బాబీ సింహా నటించిన నెగిటివ్ రోల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనీ హరీష్ నిర్ణయించుకున్నారు. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో బిజీగా ఉన్న సమయంలో హరీష్ రవితేజని కలిశారట. జిగర్తాండ చిత్రంలో నటించేందుకు రవితేజ తన అంగీకారం చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అమర్ అక్బర్ ఆంటోని చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన తరువాత హరీష్ మళ్ళీ రవితేజని కలవలేదని సమాచారం.

     Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018 Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018

    సాయిధరమ్ తేజ్ కూడా

    సాయిధరమ్ తేజ్ కూడా

    ఈ చిత్రంలో మరో పాత్ర కోసం హరీష్ శంకర్ సాయిధరమ్ తేజ్ ని కలిశాడట. తేజు కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. హరీష్ శంకర్ ఒక్క మాట కూడా చెప్పకుండానే మరో మెగా హీరో వరుణ్ ని కలసి జిగర్తాండ చిత్రం గురించి వివరించినట్లు తెలుస్తోంది.

     Poll: ఉత్తమ తెలుగు నటి 2018 Poll: ఉత్తమ తెలుగు నటి 2018

    ఇద్దరూ హర్ట్ అయ్యారు

    ఇద్దరూ హర్ట్ అయ్యారు

    రవితేజ, సాయిధరమ్ తేజ్ ఇద్దరూ హరీష్ శంకర్ వలన బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. తాము అంగీకారం తెలిపినా కూడా వేరే హీరోలని ఎంపిక చేసుకోవడంతో రవితేజ, తేజు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ రవితేజతో మిరపకాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరక్కించారు. తేజతో కూడా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన సంగతి తెలిసిందే.

     Poll: ఉత్తమ తెలుగు ప్రతినాయకుడు 2018 Poll: ఉత్తమ తెలుగు ప్రతినాయకుడు 2018

    హరీష్ శంకర్ ఫోన్ కాల్

    హరీష్ శంకర్ ఫోన్ కాల్

    వరుణ్ తేజ్ కు హరీష్ శంకర్ ఇప్పటికే కథ వివరించాడట. తాను కూడా సూచన ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వరుణ్ తేజ్ అంతరిక్షం ప్రచార కార్యక్రమాల్లో వివరించాడు. ఈ చిత్రంలో మరో హీరోగా నాగ శౌర్య నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్ ఫోన్ కాల్ కు కూడా తేజు స్పందించలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించినందుకు తేజు పెద్దగా భాదపడడం లేదట. కానీ తనకు ఒక మాట కూడా చెప్పనందుకు తేజు అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.

    English summary
    Ravi Teja and Sai Dharam Tej hurt at Harish Shankar's actions
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X