రవితేజకి కాజల్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..!

By Sindhu

సినిమా, సినిమాకు ఎక్కువగా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'వీర". రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాల్లో రవితేజ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ ఎలా హ్యాండిల్ చేశాడనేది ఈ నెల 20న తెలుస్తుంది.

అయితే రవితేజతో పాటు చిత్ర యూనిట్ సభ్యలు ఈ చిత్రం విషయంలో ఓ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ చిత్రిలో నాయికగా నటించిన కాజల్ అగర్వాల్ ఇటీవల నటించిన డార్లింగ్, బృందావనం, మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రాలు వరుసగా విజయాన్ని సాధించడంతో..తప్పకుండా వీర కూడా అదే కోవలో చేరుతుందని, ఈ చిత్ర విజయంతో కాజల్ డబుల్ హాట్రిక్ కు శ్రీకారం చుడుతుందని విశ్వాసంతో ఉన్నారు. వీర చిత్ర యూనిట్ సభ్యులు. ఇక మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు వున్న రవితేజ నటనకు తోడుగా కాజల్ అగర్వాల్, తాప్సీల అందచందాల, వేసవి సీజన్ ఈ చిత్రానికి కలిసొచ్చే అంశాలు. సో ఇక వీర బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు వీరుడిగా నిలబడతాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X