Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
హీరోగా ఎంట్రీకి సిద్దమవుతున్న రవితేజ వారసుడు.. ఏకంగా మహేష్ దర్శకుడితో బిగ్ ప్లాన్?
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్ హీరోల వారసులు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అందరి ఫోకస్ మాత్రం మాస్ హీరోల వారసుల పైనే ఉంది. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ కొడుకు కూడా త్వరలోనే యువ హీరోగా ఆరంగ్రేటం చేయబోతున్నట్లు గా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. హీరోగా మొదటి సినిమాకు మహేష్ బాబు బాబు తో సినిమా చేసి హిట్ కొట్టిన డైరెక్టర్ ను లైన్లో పెడుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రవితేజ వారసుడు
సినిమా ప్రపంచంలో హీరోల కొడుకుల ఎంట్రీ సినిమాలకు క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నిర్మాతలు దర్శకులు వారిని పరిచయం చేసేందుకు పోటీ పడుతుంటారు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ పైనే ఉంది. అతను త్వరలోనే హీరోగా ఆరంగ్రేటం చేయబోతున్నట్లుగా టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది.

ఆ సినిమాలో..
ఇదివరకే మహాధన్ రవితేజ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమా లో మహాధన్ రవి తేజ చిన్నప్పటి పాత్రలో అద్భుతంగా నటించాడు. మొదటి సినిమాలోనే అతనికి ఒక చాలెంజింగ్ పాత్రలో నటించే అవకాశం లభించింది. కళ్ళు లేని వాడిగా అతను నటించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

చదువు ఫినిష్ అవ్వగానే..
రవితేజ కొడుకుకు మొదటి నుంచి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. ఇక అతని చదువు పూర్తయిన తర్వాతనే సినిమాల్లోకి తీసుకురావాలి అని మాస్ మహారాజా రవితేజ కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇటీవల అతను యాక్టింగ్ కోర్సు పూర్తి చేసుకోవడంతో ఒక దర్శకుడు కూడా మంచి కథతో సంప్రదించినట్లు తెలుస్తోంది.

రవితేజ దర్శకులు
మహదన్ ను పరిచయం చేసేందుకు చాలా మంది దర్శకులు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది. మాస్ మహారాజా తో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు అందరూ కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే అందులో కొంతమందిని రవితేజ ద్వారానే పరిచయం అయ్యారు. కాబట్టి ఆయన కొడుకు సినిమాను కూడా వారు డైరెక్ట్ చేసే అవకాశం కోసం కొంతమంది దర్శకులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మహేష్ దర్శకుడితో..
మహాధన్ లో మంచి యాక్టర్ ఉన్నాడు అని అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమా తోనే నిరూపించాడు. ఇక ఇప్పుడు ఆ దర్శకుడితో నే మొదటి సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు లాంటి బిగ్గెస్ట్ మూవీని తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహాధన్ వెండి తెరకు హీరోగా పరిచయమవుతున్నాడు అంటే తప్పకుండా అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు.

ఎలాంటి సినిమా అంటే..
ఇక మహాధన్ మొదటి సినిమాలో ఎలా నటిస్తాడు.. ఎలాంటి కథ లో అతను అలరిస్తాడు అనే వివరాల్లోకి వెళితే.. ఒక మంచి యూత్ ఫుల్ కంటెంట్ తోనే ప్రేక్షకులను అలరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మాస్ ప్రేక్షకులను అలరించే కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అధికారికంగా న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.