జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్‌లోకి రవితేజ.. మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే ఈ హీరో.. ఆ మధ్య 'ఈగల్' మూవీతో వచ్చాడు. కానీ, ఇది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.
సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న మాస్ మహారాజా రవితేజ తన 74వ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఇది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో ఇప్పుడా ప్రాజెక్టునే స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో చేస్తున్నాడు. 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీలో హిట్ అయిన 'రైడ్' మూవీకి రీమేక్‌గా వస్తున్నట్లు తెలిసింది.

సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. ఆ వెంటనే దర్శకుడు హరీశ్ శంకర్ పలు షెడ్యూళ్లను సైతం విజయవంతంగా కంప్లీట్ చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మరో క్రేజీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి 70 శాతం షూట్ జరిపేశారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'మిస్టర్ బచ్చన్' మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ, దీనిపై ఎన్నో రకాల వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేస్తారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'మిస్టర్ బచ్చన్' చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు. అదే జరిగితే ఎన్టీఆర్ 'దేవర' సినిమా ప్లేస్‌లోకి 'మిస్టర్ బచ్చన్' మూవీ వచ్చినట్లు అవుతుంది.
ఇదిలా ఉండగా.. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తోన్న 'మిస్టర్ బచ్చన్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











