మహేశ్ బాబుతో పోటీకి రవితేజ రెడీ.. ఇద్దరూ ఒకేసారి అంటే ఎలా బాసూ!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను ఆరంభించి.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత సోలో హీరోగా మారాడు మాస్ మహారాజా రవితేజ. ఆరంభంలోనే తనదైన శైలి నటనతో ప్రేక్షకులను అలరించిన అతడు.. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు మరింత చేరువ అయ్యాడు. దీంతో మాస్ మహారాజా అన్న బిరుదును దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడని అతడు.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'ధమాకా'తో బిగ్ హిట్ కొట్టాడు.

హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు చేస్తోన్న రవితేజ.. ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వర్రావు' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. వంశీ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 1970 కాలంలో గజగజలాడించిన టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి శరవేగంగా దీన్ని జరుపుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Release on August 11th

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోన్న 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీ అనుకున్న దానికంటే వేగంగా పూర్తవబోతుందట. దీంతో ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం కూడా అదే రోజున విడుదల కాబోతుంది. అయినప్పటికీ రవితేజ సినిమాపై చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉందని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని పోటీ ఉన్నా అదే రోజు తీసుకు రాబోతున్నారని అంటున్నారు. ఈ ప్రకటన అతి త్వరలోనే రానుందని టాక్.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇందులో నుపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X