»   » వర్మ దెబ్బకి త్రాగుబోతులుగా మారిన ఇద్దరు హీరోలు..!

వర్మ దెబ్బకి త్రాగుబోతులుగా మారిన ఇద్దరు హీరోలు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రాగుబోతులకు రోజు త్రాగటానికి కారణాలు ఉండవు. ఎందుకంటే త్రాగడానికి అలవాటు పడ్డ తరువాత మందే లేనిదే వారు బ్రతకలేరు. కానీ కొంత మంది త్రాగడానికి కారణాలు ఉంటాయి. ఎప్పుడో సరదాకి తాగేవాళ్ళు కూడా ఆ కారణాల వల్ల రోజు తాగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ కోవకు చెందిన వారి లిస్టులో హాస్యనటుడు సునీల్, హీరో రవితేజ వచ్చేశారు. సునీల్ మర్యాదరామన్న హిట్ అయిన తర్వాత ఎక్కడికో వెళ్ళాడు పాపం. 'అప్పల్రాజు" దెబ్బకి ఎక్కడో పడ్డాడు. వర్మ దెబ్బకు సులనీల్ ఆశల పల్లకి నుండి ముళ్ళ పొదలో పడిపోయాడు. అప్పటి నుంచి ఒక ప్లేస్ లో ఒంటరిగా తాగటం ఇంటికి వెళ్ళటం చేస్తున్నాడని ఫిలిం నగర్ లో పుకార్లు. ఇప్పుడు కొత్తగా రవితేజ కూడా సునీల్ తో కలిసి అదే ప్లేసులో త్రాగి వెళుతున్నాడట. రవితేజ 'దొంగల ముఠా"లో నటించినందుకు గాను వర్మ మీద పీకలదాక కోపంతో ఉన్నాడని ఫిలింనగర్ లో టాక్. 'దొంగల ముఠా" దెబ్బకు రవితేజ, అప్పలరాజు దెబ్బకి సునీల్ ఇద్దరు కలిసి పెగ్గు పెగ్గుకీ వర్మను తిడుతూ బాటిల్ పూర్తి చేసి ఇంటికి వెళుతున్నారని పుకార్లు..

English summary
Now, it is heard that the two noted actors Sunil and Ravi Teja have become drink buddies. Well, the reason for that is director Ram Gopal Varma and his movies with them. While he made ‘KSD Appalaraju’ with Sunil, he made ‘Dongala Muta’ with Ravi Teja in the lead. Both the films have turned out to be duds and it is heard that this has led both heroes to turn to the bottle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu