రవితేజ స్టైయిట్ తమిళ చిత్రం ఓకే?
ప్రస్తుతం రవితేజ హవా నడుస్తోంది. మొన్నే నేనింతే చిత్రంతో నంది సాధించిన రవితేజ త్వరలో తమిళంలో స్ట్రైయిట్ ఫిలిం చేయటానికి కమిట్ అయ్యారని సమాచారం. తమిళ సూపర్ హిట్ నాడోడిగల్ తెలుగు రీమేక్ చేస్తున్న దర్శకుడు సముద్రఖనికి రవితేజ స్టైయిల్స్ నచ్చి అతన్ని తన తర్వాత సినిమాకు హీరోగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో రెండు భాషల్లోనూ ఈ సినిమా తీసే అవకాశం ఉంది. ఇక రవితేజ చేస్తున్న ఈ చిత్రం టైటిల్ శంభో శివ శంభో. అల్లరి నరేష్,శివ బాలాజి అతనితో పాటు ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం రైట్స్ తీసుకుని అదే డైరక్టర్ ని తెచ్చి తీస్తూండటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే రవితేజ త్వరలో డాన్ శీను అనే మరో చిత్రంలోనూ చేస్తున్నారు. ఆ చిత్రాన్ని నూతన దర్శకుడు గోపీచంద్ డైరక్ట్ చేస్తున్నాడు. కిక్ నిర్మించిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల అనంతరం కృష్ణ వంశి దర్శకత్వంలో కందిరీగ అనే చిత్రంలో చేయటానికి కమిట్ అయ్యారు. ఇక తమిళ పరిశ్రమలో కూడా రవితేజ నిలదొక్కుకుంటే..అతను సినిమాలన్నీ రెండు భాషల్లో ప్లాన్ చేస్తారు.


Click it and Unblock the Notifications











