For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో సెన్సేషనల్ కాంబో: నందమూరి హీరోకు విలన్‌గా స్టార్ హీరో.. ఆ మూవీ తర్వాత మరోసారి

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకతే వేరు. ఆ కుటుంబం నుంచి దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు తర్వాత ఆయన వారసులుగా పలువురు హీరోలు ఎంట్రీ ఇచ్చారు. వారిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. వీళ్ల తర్వాత కల్యాణ్ రామ్ మాత్రమే ఓ రేంజ్‌ను అందుకున్నాడు. ఇక, ఈ హీరో చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 'బింబిసారా' అనే చారిత్రక చిత్రాన్ని చేస్తున్నాడు. తాజాగా దీని గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకొచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  అప్పుడెప్పుడో వచ్చాడు.. హిట్లు కొన్నే

  అప్పుడెప్పుడో వచ్చాడు.. హిట్లు కొన్నే

  చాలా కాలం క్రితమే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్ రామ్. ఈ క్రమంలోనే ఆరంభంలో ‘అతనొక్కడే' అనే సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆ రేంజ్ బ్రేక్ దక్కడానికి అతడికి చాలా కాలమే పట్టింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘పటాస్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అయితే, ఆ తర్వాత కూడా కల్యాణ్‌కు మళ్లీ నిరాశనే ఎదురవుతూ వస్తోంది.

  పంథాను మార్చుకున్న కల్యాణ్ రామ్

  పంథాను మార్చుకున్న కల్యాణ్ రామ్

  కెరీర్ ఆరంభం నుంచీ కమర్షియల్ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చాడు కల్యాణ్ రామ్. అయితే, ‘పటాస్' తర్వాత అతడి పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను చేశాడు. వీటిలో చాలా వరకూ ప్రేక్షకుల స్పందనను అందుకున్నాయి. దీంతో ఇదే విధంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే కొత్త దర్శకులతో కొత్త కాన్సెప్టులను చేస్తున్నాడు.

  ఆ ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకున్న హీరో

  ఆ ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకున్న హీరో

  గత ఏడాది నందమూరి కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు పరాజయం పాలైంది. ఈ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ గ్యాప్ తీసుకున్నాడు. అప్పటి నుంచి అతడు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే, ఈ విరామంలో అతడు రెండు చిత్రాలు లైన్‌లో పెట్టాడు.

  బింబిసారాగా రాబోతున్న కల్యాణ్ రామ్

  బింబిసారాగా రాబోతున్న కల్యాణ్ రామ్

  ప్రస్తుతం కల్యాణ్ రామ్ ‘బింబిసారా' అనే చారిత్రక చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ టైటిల్ వీడియో విడుదలైంది. ఇందులో శవాల మీద కత్తి పట్టుకుని కూర్చుని కనిపించాడు కల్యాణ్ రామ్. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

  500 ఏళ్లు ముందుకు.. వెనక్కు వచ్చి

  500 ఏళ్లు ముందుకు.. వెనక్కు వచ్చి

  మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బింబిసారా' టైమ్ మెషీన్ ఆధారంగా నడిచే చిత్రమని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో హీరో టైమ్ మెషీన్ ఎక్కి ఐదు వందల సంవత్సరాలు వెనుకకు, ఐదు వందల సంవత్సరాలు భవిష్యత్‌లోకి వెళ్తాడట. ఆ సమయంలో బిబిసారా కథను చూపిస్తారని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

  నందమూరి హీరోకు విలన్‌గా స్టార్ హీరో

  నందమూరి హీరోకు విలన్‌గా స్టార్ హీరో

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘బింబిసారా' షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకూ పూర్తయింది. అయితే, ఇందులో విలన్‌కు సంబంధించిన సీన్స్ మాత్రం చిత్రీకరించలేదట. దీనికి కారణం ఈ భారీ బడ్జెట్ మూవీలో ఓ స్టార్ హీరోను విలన్‌గా చేయించబోతుండడమే అని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ మాస్ మహారాజా రవితేజతో సంప్రదింపులు కూడా జరిపిందని తాజా టాక్.

   ఆ మూవీ తర్వాత మరోసారి కలయిక

  ఆ మూవీ తర్వాత మరోసారి కలయిక

  తాజా సమాచారం ప్రకారం.. ‘బింబిసారా'లో కల్యాణ్ రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా రవితేజ నటిస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చేసిందట. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. గతంలో రవితేజ హీరోగా నటించిన ‘కిక్ 2'ను కల్యాణ్ రామ్ నిర్మించాడు. ఆ కారణంతోనే ఈ సినిమాకు ఓకే చెప్పాడట మాస్ మహారాజా.

  English summary
  Nandamuri Kalyan Ram Now Doing Bimbisara Movie Under Mallidi Vashist Direction. Mass Maharaja Ravi Teja to play Negative Role in This Movie. నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసారా అనే సినిమాను చేస్తున్నాడు. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రవితేజ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X