గుణశేఖర్ కు రవితేజ ట్విస్టు
ఒక్కడు వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన గుణశేఖర్ పరిస్ధితి తిరగబడింది.గత కొంత కాలంగా వరసగా భారీ ప్లాపులు ఇస్తున్న ఈ దర్శకుడు తాజాగా రవితేజ తో నిప్పు చిత్రం కమిటయ్యారు.మరో దర్శకుడు వైవి యస్ చౌదరి నిర్మించే ఈ చిత్రం ఈ పాటికి మొదలవ్వాల్సి ఉంది.అయితే రవితేజ పూర్తి స్క్రిప్టు కావాలని కండీషన్ పెట్టి ఈ సినిమాను ముందుకెళ్ళనివ్వటం లేదని తెలుస్తోంది.
మొదటినుంచి గుణశేఖర్ కి ఓ బేసిక్ లైన్ అనుకుని,కొంత వర్క్ చేసి ఆ తర్వాత సెట్స్ పై ఇంప్రవైజ్ చేసుకుంటూ షూట్ చేయటం అలవాటు.దాంతో ఒక్కోసారి ఆ ఇంప్రవైజేషన్ అద్బుతంగా పండి మంచి రిజల్ట్ రావటమో..లేక వర్కవుట్ కాకపోవటమో జరుగుతూంటుంది.అలాంటి వర్క్ కల్చర్ కి అలవాటు పడ్డ గుణశేఖర్ కి రవితేజ ఇలా స్క్రిప్టు స్కీమ్ పెట్టడం గొంతలో వెలక్కాయ పడిన పరిస్ధితి తీసుకువచ్చింది.
మరో ప్రక్క వరసగా సినిమాలు చేస్తూ పోతున్న రవితేజ తన టైమ్ ని వీళ్ళెక్కడ వేస్ట్ చేస్తారో అన్నట్లు తన నెక్ట్స్ సినిమాలు శంఖం దర్శకుడు శివతోనూ, సీనియర్ దర్శకుడు వంశీతోనూ కమిట్ అవ్వటానికి ప్లాన్ చేస్తున్నాడు. మరో ప్రక్క వైవియస్ చౌదరి తన తాజా చిత్రానికి ఫైనాన్సియర్స్ వెతికే పనిలో ఉన్నారు. ఇలా నిప్పుకి ఎవరికి తోచినట్లు వారు నిప్పు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ప్రాజెక్టు మాత్రం ఆగదనే చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











