రవితేజ తాజా చిత్రం ఆ హిందీ సినిమా కాపీనా?
రవితేజ హీరోగా రమేష్ వర్మ(రైడ్ ఫేమ్) దర్శకత్వంలో రూపొందనున్న వీర చిత్రం రేస్ అనే హిందీ చిత్రం ప్రీమేక్ గా రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇప్పటికే అందులోని మెయిన్ ట్విస్ట్ ని నాగార్జున కింగ్ చిత్రం కోసం శ్రీను వైట్ల లిప్ట్ చేయటంతో కీలకమైన కొన్ని సీన్స్ కొన్ని తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇక సైఫ్ అలీ ఖాన్ పాత్రని రవితేజ చేస్తూండగా మిగిలిన వారి ఎంపిక జరగాల్సి ఉంది. ఇక ఈ చిత్రం కోసం రవితేజ రెమ్యునేషన్ ఐదు కోట్లు తీసుకున్నట్లు వినిపించింది. ప్రవరాఖ్యుడు, ఆ ఒక్కడు చిత్రాలు నిర్మించిన టాలీ టు హాలీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక రమేష్ వర్మ...గత చిత్రం రైడ్ కూడా కాపీ కాంట్రావర్శీలో కూరుకున్నదే. ఆ చిత్రం తమిళ చిత్రం పొల్లాదవన్, ఇరాన్ చిత్రం చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ సీన్ల తో చేసారు. ఆ తర్వాత పొల్లాదవన్ రైట్స్ కొని వరుణ్ సందేశ్ తో సినిమా చేసిన గుణ్ణం సందీప్ చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అలాగే రమేష్ వర్మ గతంలో సముద్ర, భూమిక కాంబినేషన్లో వచ్చిన మల్లెపూవు చిత్రానికి కథ ఇచ్చారు. ఆ చిత్రం బరాన్ ప్రీమేక్ కావటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అలాగే బాలకృష్ణతో ప్రారంభించిన భీష్మ చిత్రం కూడా మ్యాన్ ఆన్ ఫైర్ చిత్రానికి కాపీ అని వినిపించింది.


Click it and Unblock the Notifications











