మహేష్ మాదిరి తనకు దక్కుతుందని రవితేజ ఆశ?
సినిమా రంగంలో ఉండే సెంటిమెంట్లు, నమ్మకాలు ఒక్కోసారి చూస్తే నవ్వొస్తుంది. నవ్వి పోదురుగాక నాకేటి అన్నట్లు చాలా మంది స్టార్లు....తమ నమ్మకాలపై వచ్చే కామెంట్లను పెద్దగా పట్టించుకోరు. బిగ్ బి అమితాబ్ తగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటి మెంటు ఉంది. కొంత మందికి పేర్లు మార్చుకోవడంపై నమ్మం, మరి కొందరికి ఉంగరాలపై నమ్మకం, ఇంకొందరికి సినిమా పేర్లపై నమ్మకం...ఇలా చాలా రకాల నమ్మకాలు రాజ్యమేలుతుంటాయి సినిమా రంగంలో...
తాజాగా ఓ సెంటిమెంట్ టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా ఎంత పెద్ద విషయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా కొంత షూటింగ్ టర్కీలో చిత్రీకరించారు. ఈ సినిమా తెలుగు సినిమాలోనే అతిపెద్ద రెండో హిట్ గా నిలవడంతో....చాలా మంది హీరోలు అలాంటి విజయం కోసం తహతహలాడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరింది కాబట్టే విజయవంతం అయిందని నమ్మే వారు స్టార్ టాలీవుడ్ లో ఉన్నారట. అందులో రవితేజ కూడా ఒకరని, అందుకే తన తాజా సినిమా 'నిప్పు" షూటింగు కొంత భాగం టర్కీలో ప్లాన్ చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ఈ సెంటిమెంటు ఎంత వరకు నిజం అవుతుందో 'నిప్పు" థియేటర్ల మీద పడితే గానీ తెలియదు.


Click it and Unblock the Notifications











