ఎన్టీఆర్ 'రచ్చ' టైటిల్ ని ఎత్తుకెళ్ళనున్న మరో స్టార్ హీరో
ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి "రచ్చ" అనే టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ టైటిల్ తో ఇప్పుడు రవితేజ హీరోగా సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. 'ఏమైంది ఈ వేళ" చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన సంపత్‌నంది చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ అతని దర్శకత్వంలో నటించడానికి చేసేనట్టు సమాచారం. 'ఏమైంది ఈ వేళ" చిత్రాన్ని నిర్మించిన రాధామోహనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికే 'రచ్చ" అనే టైటిల్‌ను పెట్టనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక రవితేజ నటించిన 'మిరపకాయ్" చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే రమేశ్ వర్మ దర్శకత్వంలో ప్రారంభమైన 'వీర" చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











