మిస్టర్ బచ్చన్ భారీ నష్టాలు.. రవితేజ, హరీష్ రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారా?

ఈ ఏడాదిలో ఒక్క తెలుగు సినిమా నుంచి మాత్రమే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా కూడా ఉన్న సినీ ఇండస్ట్రీస్ లో కొంత కాలం హిట్స్ పడితే కొంత కాలం దారుణంగా డ్రై వాతావరణం నడిచింది. అనుకున్న భారీ సినిమా ఆన్ టైం రాకపోవడం, చిన్న చిన్న సినిమాల పట్ల ప్రేక్షకులు అంత ఆసక్తి చూపించకపోవడం వంటివి సినీ పరిశ్రమలో కొన్ని నెలల పాటు రీ రిలీజ్ లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కాగా ఆ తర్వాత నుంచి కొన్ని కొన్ని చిత్రాలు మంచి బజ్ తో వచ్చాయి అనుకునే లోపే అవి కూడా భారీ ప్లాప్ లు గా నిలిచాయి. కాగా ఈ ఆగష్టు లోనే ఇండిపెండెన్స్ డే కానుకగా వచ్చిన చిత్రాలు ఒక దాన్ని మించి ఒకటి ప్లాప్ అయ్యాయి. తెలుగులో మెయిన్ పెద్ద సినిమాలుగా మాస్ మహారాజ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ వస్తే, మరో సినిమాగా రామ్ పోతినేని, పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచిపోయింది.

raviteja and harish shankar gave cutoff their remunerations for mr bachchan boxoffice loses

మరి బిజినెస్ పరంగా రెండు సినిమాలు కూడా చాలా నష్టాలే మిగిలిస్తే.. ఇందులో మిస్టర్ బచ్చన్ నుంచి హీరో, దర్శకుడు ముందడుగు వేసినట్టుగా తెలుస్తుంది. కాగా ఇద్దరూ కూడా చాలా వరకు తమ రెమ్యునరేషన్ లని కట్ చేసుకున్నారట. లేటెస్ట్ సినీ వర్గాల టాక్ ప్రకారం మాస్ మహారాజా రవితేజ ఏకంగా 4 ఇచ్చేస్తే దర్శకుడు హరీష్ శంకర్ కోటిన్నర నుంచి 2 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ సినిమాకి వచ్చిన నష్టాలలో స్వల్ప మొత్తంలో అయితే పూడ్చినట్టు అవుతుందని వారు ఈ నిర్ణయం తీసుకున్నారట. కాగా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణం వహించారు. మరి ఈ చిత్రం దాదాపు 20 కోట్ల లోపు వరల్డ్ వైడ్ గా బిజినెస్ ని జరుపుకోగా ఇందులో సగం షేర్ అంటే 10 కోట్ల షేర్ ని కూడా ఈ చిత్రం రాబట్టలేదని ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది.

raviteja and harish shankar gave cutoff their remunerations for mr bachchan boxoffice loses

అందుకే దర్శకుడు, హీరోనే చొరవ తీసుకుని తమ రెమ్యునరేషన్ లు వెనక్కి ఇచ్చారట. కాగా ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్స్ అనే కొత్త అమ్మాయి తెలుగు సినిమాకి పరిచయం కాగా ఈ సినిమాపై ఆమె ఎన్నో అసలు పెట్టుకుంది కానీ అంత అనుకున్న రేంజ్ లో సినిమా ఫలితం రాకపోవడంతో ఏమీ కొంచెం సైలెంట్ గానే ఉంది.

మరి ఈ సినిమాలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డని పెట్టుకున్నా కూడా అవేవి వర్కౌట్ కాలేదు. పైగా రిలీజ్ అయ్యాక ఈ చిత్రం దారుణమైన నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని వల్ల కూడా సినిమాపై ఉన్న కొంచెం పాటి ఇంట్రెస్ట్ కూడా జెనరల్ ఆడియెన్స్ లో తగ్గిపోయింది. సో ఈ అంశం కూడా సినిమా వసూళ్లపై గట్టి దెబ్బ కొట్టింది అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X