మరో పవర్ఫుల్ మాస్ దర్శకుడిని లైన్ లో పెడుతున్న రవితేజ?
ఈ ఏడాది లాక్ డౌన్ అనంతరం మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఏకైక హీరో మాస్ మహారాజా రవితేజ. కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా మొత్తంలో కరోనా కష్టకాలంలో బాక్సాఫీస్ కు ఊపిరిపోసిన ఏకైక సినిమా క్రాక్. ఈ సినిమాతో రవితేజ వరుస అపజయాలకు కూడా బ్రేక్ పడింది. దీంతో ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి.
హెబ్బా పటేల్ క్లీవేజ్ షో.. అందంతో అదరగొడుతున్న బ్యూటీ
కేవలం టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర ఇండస్ట్రీలోని దర్శకులు కూడా రవితేజతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల తమిళ దర్శకుడు శరత్ మాండవ రవితేజను కలిసి ఒక పవర్ఫుల్ స్టోరీని చెప్పినట్లు సమాచారం. పూర్తిగా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా రెడీ చేసుకున్న ఆ కథ రవితేజకు చాలా బాగా కనెక్ట్ అయ్యిందట. ఈ దర్శకుడు ఇంతకుముందు తమిళ్ బిల్లా సినిమాతో పాటు తెలుగు బిల్లాకు కూడా డైలాగ్స్ రాశాడు.

ఇక శరత్ స్క్రిప్ట్ మెచ్చిన రవితేజ పాజిటివ్ గా స్పంధించడంతో దర్శకుడు తన కొత్త సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇక విరాటపర్వం నిర్మాత సుధాకర్ ఈ సర్సరికొత్త కాంబినేషన్ ను సెట్స్ పైకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ. ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే త్రినాథరావు నక్కినతో కూడా ఒక సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











