మంత్రి శరీరంలోకి ప్రవేశించి ‘దరువు’వేసే రవితేజ
రవితేజ తాజా చిత్రం దరువులో మినిస్టర్ పాత్రలో కనిపించి నవ్వించనున్నాడని సమాచారం. ఆ పాత్ర ద్వారా ప్రస్తుత రాజకీయనాయకులపై కొన్ని జోక్స్ కట్ చేయనున్నారని తెలుస్తోంది. యమలోకం బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ. యముడుకి మొగుడు చిత్రానికి ప్రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శౌర్యం శివ డైరక్ట్ చేస్తున్నాడు. ఓ మంత్రి శరీరంలోకి రవితేజ ప్రవేశించి దరువు వేస్తాడని చెప్తున్నారు. ఈ పాత్రలో రవితేజ ఒదిగిపోయి చాలా మంది రాజకీయనాయకులుకు చురకలు వేసాడంటున్నారు.
శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రం 'దరువు'(సౌండ్ ఆఫ్ మాస్). రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది.''ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఇది భిన్నమైంది. ఈ కథలో మంచి ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అది తెరపైనే చూడాలి. శివ ఈ సినిమాను మలిచిన తీరు అద్భుతం. తప్పకుండా ఇది మంచి హిట్‌గా నిలుస్తుంది'' అని రవితేజ చెప్పారు. ఇందులో రవితేజ పాత్రలో ఐదు రకాల షేడ్స్ ఉంటాయని, ఇలాంటి పాత్ర చేయడం తనకు ఇదే ప్రథమమని, ముఖ్యంగా రవితేజ, బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్స్ ఆడియన్స్ విపరీతంగా అలరిస్తాయని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాటలు వింటూంటే రవితేజ మార్కు సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉంటుందని స్పష్టం అవుతోంది. 'నిప్పు' సినిమా ప్లాపవడంతో అభిమానులు 'దరువు' చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాల అనంతరం మే 4న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం చేసే విద్యా బాలన్ అనే డాన్స్ డైరక్టర్ పాత్ర హైలెట్ గా నవ్విస్తుందని చెప్తున్నారు.
రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ


Click it and Unblock the Notifications











