25ఏళ్లకే పెళ్లికి రెడీ అయిపోయిన రవితేజ హీరోయిన్.. వరుడు ఎవరో కాదు ఆ హీరోనే!
టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడితో ఏడు అడుగులు వేసి ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. మరోవైపు దిల్ రాజ్ సొదరుడు కొడుకు ఆశిష్ రెడ్డి ఓ ఇంటివాడు అయ్యాడు. ఇవాళ వెంకటేష్ కూతురు పెళ్లి ఘనంగా జరిగింది. ఇక వరుసగా టాలీవుడ్ లో పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కబోతుంది. ఆమె ఎవరో కాదు.. జాతీ రత్నాలు ఫేం, రవితేజ రావణసురుడు ఫేం ఫరియా అబ్దుల్లా. అయితే ఈ భామ పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు ఓ హీరోను అంటూ వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పెళ్లిళ్ల సీజన్...
సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో వరసగా స్టార్ హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారవుతున్నారు. గత ఏడాది వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఇక ఈ ఏడాది అయితే వరుసగా స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెడుతున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీని పెళ్లి చేసుకుంది.

జాతిరత్నాలు ఫేం చిట్టి
ఇక దిల్ రాజు వారసుడు ఆశిష్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. ఇక వెంకటేష్ ముద్దుల కూతురు కూడా వివాహం చేసుకుంది. ఇలా వరుసగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెడుతున్నారు సెలబ్రిటీలు. ఇప్పుడు మరో సెలబ్రెటీ కూడా పెళ్లికి రెడీ అయిపోయందట. ఈ న్యూస్ నెట్టింట తెగ ప్రచారం చేస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు... టాలీవుడ్ చిట్టి, జాతీ రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో ఈ బ్యూటీ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన సంగతి తెలిసిందే.
పెళ్లి పీటలెక్కబోతుందా...
ఇప్పుడు ఈ బ్యూటీ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో కానీ ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. కేవీ అనుదీప్ దర్శకత్వంలో కరోనా టైంలో వచ్చిన జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె స్వస్థలం హైదరాబాద్. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

నరేష్ తో కలిసి...
రవితేజ రావణసుర చిత్రంలోనూ ఈ భామ మెరిసింది. ఇప్పుడు ఈ బ్యూటీ అల్లరి నరేష్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది ఫరియా. ఈ చిత్రంలో పాన్ ఇండియా ప్రాబ్లం పెళ్లి అనే కాన్సెప్టుతో తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఫరియా అబ్దుల్లా ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పలు క్రేజీ చిత్రాలు, వెబ్ సిరీసులు చేతిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఆ హీరోనే....
ఇక ఇదిలా ఉంటే.. ఫరియా అబ్దుల్లా త్వరలోనే పెళ్లి చేసుకోనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు ఫరియా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆమె వయసు 25సంవత్సరాలు. మామూలుగా హీరోలు, హీరోయిన్లు కాస్త ఏజ్ బార్ అయ్యాకే పెళ్లి పీటలు ఎక్కుతారు. కానీ ఫరియా తొందరగానే పెళ్లి చేసుకుంటుందని తెలుస్తోంది. అయితే మన జాతి రత్నాలు చిట్టీకి కాబోయే వరుడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడేనని సమాచారం.

చెక్ పెడుతుందా...
ఆ కుర్రాడు ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఫరియా పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి. మరి వీటిపై చిట్టీ అదే ఫరియా ఏమైనా స్పందించి చెక్ పెడుతుందా లేదా లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











