Raviteja : షూటింగ్ లో రవితేజకు గాయాలు..ఏకంగా చేతికి 10 కుట్లు?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టిన ఆయన ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఆయనకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

బిజీ బిజీగా

బిజీ బిజీగా

చివరిగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఆ సినిమాతో ఘోరమైన ప్రారంభమైన పరాజయం అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వరుస సినిమాలు లైన్ లో పెట్టి ఒక సినిమా షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తూ ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు.

గాయాలపాలయ్యాడు

గాయాలపాలయ్యాడు

అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. సినిమా షూటింగ్ లో భాగంగా రెండు రోజుల క్రితం రవితేజ గాయాలపాలయ్యాడు అని తెలుస్తోంది.

రవితేజ నిర్ణయం

రవితేజ నిర్ణయం

ఒక రిస్క్ తో కూడిన ఫైట్ సీన్ షూటింగ్ చేస్తున్న సమయంలో రవితేజ చేతికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో భారీగా కుట్లు కూడా పడ్డాయని తెలుస్తోంది. అయితే అప్పటికప్పుడు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన రెండు రోజుల గ్యాప్ తీసుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ కోసం పీటర్ హెయిన్స్ సహా అనేక మంది ఓటర్లు కూడా ఉన్న నేపథ్యంలో వారి డేట్స్ వృధా కాకుండా నిర్మాతగా నష్టం కలగకుండా షూటింగ్ లో పాల్గొనాలని రవితేజ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

రుసగా లైన్ లో

రుసగా లైన్ లో

ఈ నేపథ్యంలో రవితేజ అభిమానులు కాస్త కంగారు పడినా సరే తమ అభిమాన హీరో ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు అని మళ్లీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు అనే విషయం తెలుసుకుని వారు కాస్త కుదుట పడుతున్నారు. ఇక రవితేజ ఈ సినిమా కాకుండా మరిన్ని సినిమాలు వరుసగా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా వంటి సినిమాలు చేస్తున్నారు.

ఐదు కథలు

ఐదు కథలు

తనకు ఒక ఫ్లాప్ ఇచ్చిన ఖిలాడీ రైటర్ దగ్గర ఆయన దాదాపు అయిదు సినిమాలు కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఎలా అయినా తన ఖాతాలో ఎక్కువ హిట్ సినిమాలు పడాలన్న ఉద్దేశంతో భారీ మొత్తం చెల్లించి శ్రీకాంత్ విస్సా దగ్గర సుమారు ఐదు కథలు సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X