రవితేజ ఇంటి నుంచి మరో హీరో.. ఆ బడా నిర్మాతతో అదిరే ప్లానింగ్!

సినీ పరిశ్రమలో వారసులు రావడం అనేది చాలా కామన్. మెగాస్టార్ చిరంజీవి మొదలు ప్రస్తుతం ఉన్న ఎంతోమంది హీరోల వారసులు సినీ రంగ ప్రవేశం చేసి తమ లక్కు పరీక్షించుకుని కొంత మంది నిలబడితే కొంత మంది మాత్రం కనుమరుగైపోయారు. ఇప్పుడు తాజాగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడిన రవితేజ కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడనే ప్రచారం ఊపు అందుకుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

చిన్న చిన్న పాత్రల్లో

చిన్న చిన్న పాత్రల్లో

ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ రంగ ప్రవేశం చేసిన మాస్ మహారాజా రవితేజ అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నాడు. రవితేజను చూస్తే సాధారణంగా మన పక్కింట్లో ఉండే కుర్రాడిని చూస్తూ ఉంటుందని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. అలా ప్రేక్షకులతో మమేకమైన ఆయన ఇప్పటికే తన సోదరులు ఇద్దరినీ సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే వారిలో ఒకరు సినీ పరిశ్రమలో అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తూ ఉండేవారు.

 హీరోగా లాంచ్

హీరోగా లాంచ్

కానీ కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.. ఆ తర్వాత రవితేజ కుమారుడు రవితేజ తన కుమారుడిని లాంచ్ చేశారు. రవితేజ హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో రవితేజ వారసుడిగా తనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు తన సోదరుడి కుమారుడు మాధవ భూపతిరాజును హీరోగా లాంచ్ చేయడానికి రవితేజ సన్నాహాలు చేస్తున్నాడట. దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయనని హీరోగా లాంచ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

కొత్త దర్శకుడితో

కొత్త దర్శకుడితో

అయితే ఖిలాడీ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు చూస్తే ఆయనతో ఎలా సినిమా లాంచ్ ప్లాన్ చేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు అవే అనుమానాలు నిజమవుతున్నాయి రమేశ్ వర్మతో సినిమా లాంచింగ్ నిజం కాదని ఒక కొత్త దర్శకుడితో తన కుమారుడుని లాంచ్ చేయడానికి రవితేజ సిద్ధమయ్యారని తెలుస్తోంది. అది కూడా ప్రముఖ నిర్మాత నల్లమలపు బుజ్జి నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు.

హిట్టవుతుందనే నమ్మకంతో

హిట్టవుతుందనే నమ్మకంతో

తనకు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన నల్లమలపు బుజ్జి తన సోదరుడి కుమారుడు మొదటి సినిమాకి నిర్మాతగా ఉంటే ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో రవితేజ ఉన్నారని తెలుస్తోంది. చివరిగా కిలాడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ప్రస్తుతానికి చాలా సినిమాలు లైన్ లో పెట్టారు. రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాల షూటింగ్స్ లో ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
అధికారికంగా ప్రకటించే అవకాశం

అధికారికంగా ప్రకటించే అవకాశం

రవితేజకు ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో ఒకరి పేరు భరత్ రాజు కాగా మరొకరి పేరు రఘురాజు. వీరిలో భారత్ రాజు 2017 వ సంవత్సరంలో ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో మరణించారు. ఇక ఈ లాంచింగ్ వార్త అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి ఇది ఎప్పటికి నిజం కానుందనేది.

More from Filmibeat

Read more about: ravi teja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X