పవన్ కళ్యాణ్ కోసం స్టోరీ సెట్ చేయిస్తున్న మాస్ మహారాజా?
పవన్ కళ్యాణ్ దర్శకుల లిస్ట్ ఇప్పట్లో తగ్గేలా లేదని అనిపిస్తోంది. వకీల్ సాబ్ అలా ఏండింగ్ కి వచ్చిందో లేదో వరుసగా స్టార్ దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి లైన్ లో నిలబడుతున్నారు. అయితే పవన్ మాత్రం కేవలం తనకు నచ్చిన దర్శకులతోనే సినిమా చేస్తాడు అనేది అందరికి తెలిసిన విషయమే. పవన్ కి దర్శకుడు నచ్చితే అతని బ్యాక్ గ్రౌండ్ రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఇక రవితేజతో వర్క్ చేసే హరీష్ శంకర్, బేబి వంటి వారి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.
ఇక ఇటీవల రవితేజ సలహాతో నెక్స్ట్ పవన్ ఒక కమర్షియల్ డైరెక్టర్ ని లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. మాస్ రాజాతో డాన్ శీను, బలుపు వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని. నెక్స్ట్ రానున్న క్రాక్ సినిమాను తెరకెక్కించింది కూడా ఈ దర్శకుడే. అయితే క్రాక్ రిలీజ్ అనంతరం రవితేజ ఇచ్చిన సలహా మేరకు గోపిచంద్ పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి మెస్సేజ్ ఇచ్చే కమర్షియల్ కథను సెట్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ కాంబినేషన్ కి సంబంధించిన గాసిప్స్ ఫిల్మ్ నగర్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి.

అయితే పవన్ మాత్రం ముందు అగ్రిమెంట్ కుదుర్చుకున్న సినిమాలని ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. దాదాపు వకీల్ సాబ్ పూర్తయిన విషయం తెలిసిందే. కేవలం ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఇక క్రిష్ సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఆ సినిమా తరువాతనే హరీష్ శంకర్ కథను సెట్స్ పైకి తీసుకురానున్నాడు. ఆ తరువాత గోపిచంద్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్. మరి పవన్ కళ్యాణ్ సెట్ చేసుకున్న ఈ ప్లాన్ ఎంత స్పీడ్ గా అమలులోకి వస్తుందో తెలియాలి అంటే కరోనా తగ్గే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











