రవితేజ ‘దరువు’ నిర్మాతలకు బరువు???
రవితేజ తాజా చిత్రం 'దరువు'నిర్మాతలకు బరువు గా మారిందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కీలకమైన ప్రాంతాల్లో నిర్మాతలు చెప్పిన రేటుకు తీసుకోవటానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావటం లేదని సమాచారం. దానికి కారణం..రవితేజ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటమేనని అంటున్నారు. దాంతో భారీ బడ్జెట్ తో తీసిన దరువు కి క్రేజ్ రావటంలేదని,బయ్యర్లు ఆసక్తి చూపటం లేదని టాక్. సినిమా చాలా బాగా వచ్చిందని టాక్ వచ్చినా బిజినెస్ విషయంలో ముందడగు వెయ్యటం లేదని చెప్పుకుంటున్నారు. దానికి తోడు దర్శకుడు శివ గత చిత్రం శంఖం కూడా భాక్సాపీస్ వద్ద వర్కవుట్ కాలేదు. దాంతో వేరే దారిలేక నిర్మాతలే చాలా ఏరియాల్లో ఎగ్జిబిటిర్స్ తో మాట్లాడుకుని స్వయంగా రిలీజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
నిజానికి దొంగలముఠా ఫెయిల్యూర్ కి వర్మ మీదకు కొట్టుకుపోయినా నిప్పు,వీర డిజాస్టర్ కావటం రవితేజకు బాగా మొనస్ గా మారింది. రవితేజ సినిమా అంటే మినిమం కామిడీ ఉంటుంది..వినోదానికి పూర్తి గ్యారెంటీ అనే ముద్రను వీర,నిప్పు మిస్ చేసాయి. అంతేగాక..ప్రేక్షకులకు రవితేజ మారని మ్యానరిజమ్స్ మొనాటనీ రావటం వల్ల రవితేజ మ్యాజిక్ పని చేయలేదని మరో టాక్ ఉంది. అయితే రవితేజ మాత్రం కాన్ఫిడెంట్ గా దరువుపై నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం తనకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాడు. దానికి తోడు ఈ చిత్రం గతంలో చాలా సార్లు ప్రూవ్ అయిన యమలోకం బ్యాక్ డ్రాప్ లో రావటం కూడా ప్లస్ అవుతుందని చెప్తున్నారు.
రవితేజ, తాప్సీ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'దరువు'. సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం మే 4న విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసినట్లు నిర్మాత చెప్తున్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ...అతను పక్కా మాస్. మనిషి మాస్క్ వేసుకున్న ట్రాన్స్‌ఫార్మర్‌లాగా పూర్తి ఎనర్జీతో ఉంటాడు. శత్రువులకు అతనంటే బెదురే. అతగాడు దరువేశాడంటే భూగోళం దద్దరిల్లాల్సిందే. ఈ తరహా మనస్తత్వంతోనే రవితేజ పాత్రను తీర్చిదిద్దాం అన్నారు. అలాగే కొంచెం యాక్షన్‌కి, ఇంకొంచెం సున్నితమైన భావోద్వేగాలకూ చోటుంటుంది. ఈ కొలతలతో మరో సినిమా సిద్ధమైపోతోంది. ఈసారి మాత్రం వినోదాల సౌండ్ ఎక్కువే. మాస్‌తో తీన్‌మార్ ఆడించే కథతో వస్తున్నారని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ..రవితేజకు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. నూటికి నూరు పాళ్లు వినోదంతో రంగరించి ఈ సినిమా తీస్తున్నాం అన్నారు. బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.


Click it and Unblock the Notifications











