Spirit: దిమ్మతిరిగే ట్విస్ట్.. ప్రభాస్‌ మూవీతో స్టార్ హీరో తనయుడు ఎంట్రీ.. ఇంతకీ సందీప్ రెడ్డి ప్లాన్ ఏంటీ?

Spirit: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ "స్పిరిట్". ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై రోజురోజుకు హైప్ పెరుగుతూనే ఉంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డుస్థాయిలో వైరల్ అవుతూ, తెలుగు మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులలోనూ ఆసక్తి రేపింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ సంగతేంటీ?

ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో సినిమా వస్తుందనగానే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రభాస్ ఫ్యాన్ ఇండియా క్రేజ్, సందీప్ రెడ్డి వంగ టేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్ తో హిస్టరీ క్రియేట్ చేశారు. అలాంటి స్టార్ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ పై ఆడియన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేసి నాటి నుంచి అంచనాలు పెరిగేలా రోజుకు కొత్త వార్త తెరమీదకి వస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

RaviTeja son Mahadhan Trivikram Son Rishie Manoj likely to join Prabhas Spririt Movie

రీసెంట్ గా చిరంజీవి క్యామియో రూమర్స్‌పై సందీప్ వంగా స్వయంగా క్లియర్ చేశారు.ఇక కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ విలన్‌గా నటిస్తున్నారా? అనే ప్రశ్నపై మాత్రం సైలెంట్‌గా ఉండడం ఫ్యాన్స్‌లో మరో స్థాయి సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఆయన సమాధానం కూడా "అప్‌డేట్ త్వరలో వస్తుంది" అని మాత్రమే చెప్పటంతో ఆసక్తి మరింత పెరిగింది. డాన్ లీ నిజంగా విలన్‌గా వస్తే, 'స్పిరిట్' అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరోవైపు, ఈ భారీ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో వేగంగా సాగుతోంది. సినిమా 2026 ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఈ నెలాఖరులో పూజా కార్యక్రమం జరగనుంది. భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. యానిమల్ ఫేమ్ త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తరుణ్, మడోన్నా సెబాస్టియన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారట.

ఇదెలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్, అలాగే మాస్ మహరాజా రవితేజ కుమారుడు మహదాన్ భూపతిరాజు ఈ చిత్ర బృందంలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేయనున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా మహదాన్ భూపతిరాజు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ విషయంపై మాత్రం స్పష్టత లేకపోయినా, ఈ ఇద్దరు స్టార్ వారసులు "స్పిరిట్"తోనే టాలీవుడ్‌కు టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో ఎంట్రీ ఇస్తున్నారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.

మొత్తం మీద, "స్పిరిట్" టీజర్‌తో మొదలైన హైప్ ఇప్పుడు రెట్టింపు అయింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సౌండ్‌ గ్లింప్స్ ఇప్పటికే మాస్ రెస్పాన్స్ రాబట్టగా... ఇప్పుడు స్టార్ వారసుల ఎంట్రీ రూమర్స్, డాన్ లీ పై సందీప్ వంగా సైలెన్స్ ఇవన్నీ కలిసి ఈ సినిమాపై కొత్త ఉత్కంఠను పెంచుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో "స్పిరిట్" ప్రభాస్ కెరీర్‌లోనే కాకుండా భారతీయ సినీ ప్రపంచంలో మరో సంచలన విజయం అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X