మెగాస్టార్ సినిమాలో మరో మాస్ హీరో... బాస్ కోసం మళ్ళీ 15 ఏళ్ల తరువాత..

ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా కనిపించేవి. అయితే మన స్టార్ హీరోలు 10 ఏళ్ళ ముందు వరకు కూడా మల్టీస్టారర్ కథలపై అంతగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టుగా ప్రస్తుతం జనరేషన్ లో మల్టీస్టారర్ కథలు వస్తేనే కొత్తగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేస్తే హీరోల మార్కెట్ వాల్యూ కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఎక్కువగా మల్టీస్టారర్ కథలు సెట్స్ పైన ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి తో మరొక మా హీరో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుందట.

ముందుగా తనయుడితో..

ముందుగా తనయుడితో..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఆరు పదుల వయసులో కూడా ఆయన నేటి తరం యువ హీరోల తరహాలోనే బిజీబిజీగా గడుపుతున్నారు. మొదట ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు ఇద్దరు కూడా ఒకే తరహాలో చాలా పవర్ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.

ఆచార్య తరువాత..

ఆచార్య తరువాత..

మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అంటే తప్పకుండా అందులో ఏదో ఒక అంశం హైలెట్గా గా ఉంటుంది. ఆచార్య అనంతరం లూసిఫర్ రీమేక్ తో రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఒక యువ హీరో నటించబోతున్నట్లు ఇదివరకే అనేక రకాల కథనాలు వచ్చాయి.

రవితేజతో కూడా

రవితేజతో కూడా

ఇక బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కూడా ఒక మాస్ హీరో నటించబోతున్నట్లు టాక్ అయితే వస్తుంది. ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ అని తెలుస్తోంది. దర్శకుడు బాబీ మెగాస్టార్ తో చేయబోయే సినిమాకు వాల్తేరు వీర్రాజు అనే టైటిల్ ను సెట్ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి ఇక అందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది.

Recommended Video

SP Balasubrahmanyam : సజీవ మూర్తిగా ఎస్పీ బాలు.. చీకటి వెలుగులతోపాటు | Mohan Lal | Filmibeat Telugu
త్వరలోనే క్లారిటీ..

త్వరలోనే క్లారిటీ..

మాస్ రాజా రవితేజ తన కెరీర్ లో హీరోగా ఎదుగుతున్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అన్నయ్య సినిమాలో నటించాడు. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలానికి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక పాటలో గెస్ట్ గా కనిపించాడు. ఇక మళ్లీ పదిహేనేళ్ల తర్వాత వాల్తేరు వీర్రాజు ప్రాజెక్టులో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక దర్శకుడు బాబీ తో రవితేజ ఇదివరకే పవర్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది కాబట్టి రవితేజ కాంబినేషన్ కు పెద్దగా సమయం పట్టక పోవచ్చు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X