షూటింగ్ పూర్తయిన తరువాత రవితేజ అప్సెట్.. మళ్ళీ రీ షూట్?
ఒక సినిమా సెట్స్ పైకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు కూడా వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేయాలని కష్టపడతారు. కానీ షూటింగ్ పనులు ఎండ్ అయ్యాక మళ్ళీ రీ షూట్ చేయాలి అంటే కొంత అసంతృప్తిగానే ఉంటుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే రవితేజ కూడా ఇటీవల తన సినిమా విషయంలో కొంత అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత మళ్ళీ రీ షూట్ చేయాలని చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి.
డాన్ శీను, బలుపు వంటి కమర్షియల్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని రవితేజతో చేసిన మరో సినిమా క్రాక్. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన షూటింగ్ పార్ట్ ని ఇటీవల పూర్తి చేయగా సినిమా మొత్తం చూశాక రవితేజ కొంత అప్సెట్ అయ్యారట. కొన్ని సీన్స్ సంతృప్తిగా అనిపించకపోవడంతో వెంటనే మళ్ళీ షూట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

సినిమా అంతా బాగానే ఉంది కాని అక్కడక్కడా కొన్ని సీన్స్ కథ ఫ్లోకి అడ్డం పడ్డట్లు ఉండడంతో వాటిని సరి చేయడానికి రెడీ అయ్యారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని క్రాక్ సినిమాపై మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటుందని ధీమాగా ఉన్నారు. సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక విడుదలైన ఒక టీజర్ కి రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది. మరి ఈ మాస్ కమర్షియల్ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











