కొత్త బ్యూటీపై కన్నేసిన రవితేజ.. అప్పుడు శ్రీలీల.. ఇప్పుడు ఎవరంటే?
సినిమాల విషయంలో ఒకప్పుడు అంటే దాదాపు ఏం చేసినా చెల్లేది అలాగే జనం కూడా విపరీతంగా ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడడంతో హాఫ్ బేకింగ్ ప్రొడక్ట్స్ చేసినా కూడా పెద్ద విజయాలు సాధించేవి. కానీ ఇపుడు పరిస్థితులు ఇలా లేవు. ట్రెండ్ మారడంతో తరం ఆలోచనా విధానం కూడా మారింది. పైగా సోషల్ మీడియా ఒకటి ఎక్కువ కావడంతో అప్పట్లో చేసినట్టుగా సినిమాలు ఇపుడు చేస్తే దాదాపు ఆడియెన్స్ రిజెక్ట్ చేసేస్తున్నారు.
ఇక ఇలా రిజెక్ట్ చేయడానికి ఉన్న పలు గట్టి కారణాల్లో హీరో అండ్ హీరోయిన్స్ నడుమ ఏజ్ గ్యాప్ లాంటి అంశాలు కూడా లేకపోలేవు. అప్పట్లో కలర్ సినిమాలు వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా పలు సినిమాలు రన్ అయ్యాయి. కానీ ఇపుడు ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.

ఏదో పెద్ద స్టార్ సినిమా అయినప్పటికీ కూడా నెగిటివ్ వచ్చినా కంటెంట్ ఉంటే నిలబడుతున్నాయి తప్ప మిడ్ రేంజ్ హీరోలు సినిమాలు అయితే దారుణంగా ట్రీట్ చేయబడుతున్నాయి. కాగా ఈ కోణంలో ప్రెజెంట్ తెలుగులో భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ ముందు వరుసలో కనిపిస్తున్నారు.
ఒకప్పుడు రవితేజ అంటే అందరి హీరోల అభిమానులు న్యూట్రల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఆదరించేవారు. కానీ తన ఏజ్ కంటే చాల తక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్స్ తో తాను రొమాన్స్ చేయడం మరిన్ని సినిమాలు ఓకే చేస్తుండడంతో తనపై కూడా ఎన్నడూ లేని రేంజ్ నెగిటివ్ వచ్చింది. ఇక ఈ పరిస్థితి ఎలా మారింది అంటే మార్కెట్ లోకి ఏ కొత్త యంగ్ హీరోయిన్ వచ్చినా రవితేజ కన్ను పడినట్టే అనే రేంజ్ లోకి మారిపోయాయి.
గతంలో శ్రీలీల లాంటి వాళ్లు రవితేజ ద్వారా పలువురు యంగ్ హీరోయిన్స్ పరిచయం ఇపుడు స్టార్ స్టేటస్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ నెగిటివ్ మాత్రం రవితేజనే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వినిపించిన మరో యంగ్ హీరోయిన్ పేరు 'కాయదు లోహర్'. తమిళ చిత్రం "డ్రాగన్" తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈమెకి ఇపుడు తెలుగులో కూడా ఆఫర్లు మొదలయ్యాయి.

దీనితో ఈ ఆఫర్స్ లో ఆమెకి రవితేజ నుంచి కూడా ఆఫర్ వస్తుందేమో అన్నట్టుగా పలు ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. దీనితో ఈ రకంగా కూడా కాయదు పేరు మళ్ళీ వైరల్ గా మారింది. అయితే రవితేజ విషయంలో ఈ హీరోయిన్ కంటే ముందు ఇంకొందరు విషయంలో కూడా ఈ తరహా కామెంట్స్ వచ్చేవి. మరి ఈ బ్యాచ్ అంతా రవితేజని ఎందుకు అంత పగపట్టేసారో వారికో తెలియాలి.
ఇక ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ "ధమాకా" తో బ్రేక్ అందుకున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీలతోనే మరోసారి వర్క్ చేస్తుండగా ఆ సినిమానే "మాస్ జాతర". ఈ సినిమాతో మళ్ళీ వీరిద్దరూ సెన్సేషనల్ హిట్ కొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ చిత్రం ఈ మే 9న రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











