RC 15 : మరొక ఇంటెస్టింగ్ లీక్.. సినిమాలో స్పెషల్ ఫైట్.. రోబో తరహాలోనే?

సంచలన దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC15 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా మేకింగ్ విధానం పై ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేలా ఉందని అభిమానుల్లో కూడా ఒక నమ్మకం కలుగుతోంది. ఇక నిర్మాత దిల్ రాజు కూడా శంకర్ స్టైల్ లోనే సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. బడ్జెట్ విషయంలో ఆయన ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. ప్రతి సన్నివేశం కూడా హై రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు కూడా ఇప్పటికే దర్శకుడు ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు.

ఈ సినిమాలో ప్రతి ఫైట్ కూడా గతంలో లేని విధంగా ఉండాలని రామ్ చరణ్ కూడా వర్క్ షాప్ లో పాల్గొనే అవకాశం ఉందట. దర్శకుడు శంకర్ ప్రతి సినిమాలో కూడా ఒక స్పెషల్ ఫైట్ మాత్రం హైలెట్ గా ఉంటుంది. ముఖ్యంగా రజినీకాంత్ రోబో సినిమాలో ట్రైన్ ఫైట్ ఎంతగా క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక RC 15లో కూడా ఒక ట్రైన్ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుందట. విలన్స్ ను చితక్కొట్టే యాక్షన్ సీన్స్ ఇంతకుముందు రామ్ చరణ్ ఎప్పుడూ చేయని విధంగా ఉంటుందని సమాచారం. నిర్మాత దిల్ రాజు కూడా ఫైట్స్ కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. చూస్తుంటే శంకర్ రామ్ చరణ్ సినిమాకు పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవచ్చు అని తెలుస్తోంది.

Rc 15 latest update ram charan high voltage train fight scene

ఇక అంచనాల స్థాయి అంతకంతకూ పెరిగే విధంగా సినిమా కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మొదలైన ఈ బిగ్ బడ్జెట్ మూవీ మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ తో బిజీ కానుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా సమయానికి పూర్తిచేసే 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శంకర్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. సాధారణంగా శంకర్ ఒక్క సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర సమయాన్ని కేటాయిస్తారు. కానీ ఈ సినిమా కోసం మాత్రం అంతకంటే తక్కువ సమయంలోనే ఫినిష్ చేసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మరొక ముఖ్యమైన పాత్రలో తెలుగు అమ్మాయి అంజలి సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా కోసం మూడు పాటలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది మ్యూజిక్ విషయంలో కూడా శంకర్ ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా నెవర్ బిఫోర్ అనేలా అద్భుతంగా ఉంటుందని సమాచారం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X