రాంచరణ్ చిత్రం గురించి క్రేజీ న్యూస్.. ఆ దేశంలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు సినిమా!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు.చరణ్, బోయపాటి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో కళ్ళు మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని బోయపాటి తీర్చిదిద్దుతున్నారు. తాజగా ఈ చిత్ర షూటింగ్ గురించి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

తొలి తెలుగు సినిమా
యూరప్ లోని పలు దేశాల్లో తెలుగు చిత్రాల షూటింగ్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అజర్బైజాన్ దేశం గురించి చాలా తక్కువగా విని ఉంటాం. ఈ దేశంలో షూటింగ్ జరుపుకోబోతన్న తొలి తెలుగు చిత్రంగా రాంచరణ్ సినిమా నిలవబోతోంది.

కాస్పియన్ సముద్ర అందాలు
దాదాపు నెలరోజుల పాటు బోయపాటి శ్రీను అజర్బైజాన్ దేశంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అద్భుతమైన లొకేషన్లకు అజర్బైజాన్ పెట్టింది పేరు. కాస్పియన్ సముద్ర తీర అందాలు, ఆ దేశ రాజధాని బాకు అత్యాధునిక హంగులు అందరిని మంతముగ్దుల్ని చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

భారీ స్థాయిలో
30 రోజులపాటు అంటే సాంగ్స్ తో పాటు కీలమైన సన్నివేశాలు కూడా అక్కడ చిత్రీకరించనున్నారు. షూటింగ్ మొదలై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానుల ఎదురుచూపులు తప్పడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఫస్ట్ లుక్ విడుదుల కావొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
క్రేజీ కాంబినేషన్
భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండడం మరో ఆసక్తికరమైన అంశం. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్.


Click it and Unblock the Notifications











